రాత్రి వేళ ఫుడ్‌ను ఎంత లైట్‌గా తీసుకుంటే అంత మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు.అందుకే చాలా మంది వైట్ రైస్‌ను ఎవైడ్ చేస్తుంటారు.
దాని బదులు గోధమ పిండితో చేసిన చపాతీలు, బ్రెడ్ వంటివి తీసుకుంటారు.కానీ, వీటి కంటే ఇప్పుడు చెప్పబోయే సూప్ ఆరోగ్యానికి మరింత మేలు చేస్తుంది.
మరియు ఈ సూప్‌ను తీసుకుంటే పొట్ట లైట్‌గా కూడా ఉంటుంది.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ సూప్ ఏంటీ.? దాన్ని ఎలా తయారు చేసుకోవాలి.? వంటి విషయాలపై ఓ లుక్కేసేయండి.
ముందుగా మిక్సీ జార్ తీసుకుని అందులో హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క వేసుకుని కచ్చా పచ్చాగా పేస్ట్ చేసుకోవాలి.అలాగే ఒక గిన్నెలో మూడు టేబుల్ స్పూన్ల జొన్న పిండి, అర కప్పు వాటర్ వేసుకుని ఉండలు లేకుండా కలిపి పెట్టుకోవాలి.
ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని రెండు గ్లాసుల వాటర్ పోయాలి.వాటర్ హీట్ అవ్వగానే అందులో జొన్న పిండి మిశ్రమం, జీలకర్ర-అల్లం-పచ్చిమిర్చి పేస్ట్, రుచికి సరిపడా ఉప్పు వేసుకుని రెండు నిమిషాల పాటు స్పూన్‌తో తిప్పుకుంటూ ఉడికించాలి.
ఇప్పుడు ఇందులో నాలుగు టేబుల్ స్పూన్ల క్యారెట్ తురుము, మూడు టేబుల్ స్పూన్ల స్వీట్ కార్న్,
రెండు టేబుల్ స్పూన్ల గ్రీన్ బఠానీ వేసి పది నుంచి పదిహేను నిమిషాల పాటు ఉడికించి చివర్లో కొద్దిగా కొత్తిమీర వేస్తే జొన్న సూప్ సిద్ధం అవుతుంది.ఈ సూప్‌ను రాత్రి వేళ రైస్‌కు బదులుగా తీసుకుంటే హెవీగా తిన్నామనే ఫీలింగ్ ఉండదు.మంచి నిద్ర పడుతుంది.
మలబద్ధకం సమస్య ఉంటే దూరం అవుతుంది.
బ్లెడ్ షుగర్ లెవల్స్ అదుపులో ఉంటాయి.ఇక చాలా మంది వెయిట్ లాస్ అవ్వాలని ప్రయత్నిస్తుంటారు.
అలాంటి వారికి కూడా ఈ సూప్ అద్భుతంగా సహాయపడుతుంది.నైట్ ఈ జొన్న సూప్‌ను తీసుకుంటే జీవక్రియ రేటు పెరిగి వేగంగా బరువు తగ్గుతారు.