బన్నీకి స్పెషల్ గిఫ్ట్ పంపిన విజయ్ దేవరకొండ... స్వీట్ బ్రదర్ అంటూ ఫిదా అయిన బన్నీ! 

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda), అల్లు అర్జున్ (Allu Arjun)గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.వీరిద్దరి మధ్య ఎంతో మంచి బాండింగ్ కూడా ఉంది.

 Vijay Devarakonda Send Special Gift For Allu Arjun Bunny Gives Sweet Reply , All-TeluguStop.com

ఇకపోతే విజయ్ దేవరకొండ ఇటీవల కాలంలో వరుసగా అల్లు అర్జున్ కు సర్ప్రైజ్ గిఫ్టులు పంపిస్తూ ఉన్నారు.తన రౌడీ బ్రాండ్ నుంచి ప్రత్యేకంగా పుష్ప2 రిలీజ్ టైం లో స్పెషల్గా డిజైన్ చేయించిన టీ షర్టులను కానుకగా పంపించి సర్ప్రైజ్ చేశారు.

ఇకపోతే తాజాగా మరోసారి మరిన్నీ గిఫ్టులతో అల్లు అర్జున్ కు సర్ప్రైజ్ గిఫ్ట్ ప్లాన్ చేశారని చెప్పాలి.

ఇలా విజయ్ దేవరకొండ పంపించే కానుకలను అల్లు అర్జున్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ విజయ్ దేవరకొండకు చాలా విభిన్నంగా థాంక్స్ చెబుతూ పోస్ట్ చేస్తూ ఉంటారు.

అయితే తాజాగా విజయ్ తన రౌడీ బ్రాండ్‌(Rowdy Brand) స్టోర్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించారు.ఈ సందర్భంగా బన్నీకి రౌడీ బ్రాండ్‌ డ్రెస్‌లను, పిల్లల కోసం కొన్ని బర్గర్‌లను పంపారు.

ఈ క్రమంలోనే బన్నీ ఆ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ.

Telugu Allu Arjun, Rowdy, Tollywood-Telugu Top Posts

మై స్వీట్‌ బ్రదర్‌.ఎప్పుడూ నువ్వు సర్‌ప్రైజ్‌ చేస్తుంటావు… సో స్వీట్ అంటూ తన ఇంస్టాగ్రామ్ స్టోర్ ద్వారా షేర్ చేశారు.ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతుంది.

ఇక విజయ్ దేవరకొండ ప్రస్తుతం గౌతం తిన్ననూరి సినిమా పనులలో బిజీగా ఉన్నారు.ఇక అల్లు అర్జున్ సైతం పుష్ప 2 తరువాత తన తదుపరి చిత్రాన్ని డైరెక్టర్ అట్లీతో ప్రకటించిన విషయం తెలిసిందే.

ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.ఈ సినిమా కూడా అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా పాన్ ఇండియా స్థాయిలోనే  తెరకెక్కబోతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube