మన కోరికలను త్వరగా తీర్చే దైవం ఎవరో మీకు తెలుసా?

హిందూ సంప్రదాయంలో సకల దేవతా గణములకు వినాయకుడు అధిపతి గణనాయకుడు, గణపతి, గణేశుడు.అన్ని అడ్డంకులు తొలగించు వాడు విఘ్నేశ్వరుడు,అన్నికార్యములకూ, అన్ని పూజలకూ మొదటగా పూజలు అందుకుంటారు.

 Do You Know Who Is The God Who Fulfills Our Desires Quickly, Good , Desires ,-TeluguStop.com

చదువు, జ్ఙానానికీ,విజయానికి ప్రతీక వినాయకుడు.వినాయకుణ్ణి పూజించి ఏదైనా కార్యం తలపెడితే వెంటనే జరగటమే కాకుండా ఎటువంటి విఘ్నలు ఉండవు.

వినాయకుడు త్వరగా అనుగ్రహించే దేవుడు.గ- అంటే బుద్ధి, ణ- అంటే జ్ఞానం గణాధిపతి అయిన వినాయకుడు ‘బుద్ది’ని ప్రసాదిస్తే, సిద్ధి తనకు తానుగా ప్రాప్తించగలదు.

త్రిపురాసురుని సంహరించిన శివుడు, మహిషాసురుని మర్దించిన పార్వతీదేవి ఇద్దరూ కూడా వినాయకుని సేవించి విజయాన్ని పొందిన వారేనని గుర్తుంచుకోవాలి.

Telugu Ganapathilord, Hindu Dharma, Korikalutirche, Lord Rama, Parvathi, Pooja,

శ్రీమహా విష్ణువు పరిపూర్ణ మానవుడిగా అవతారమెత్తిన శ్రీరాముడు, కృష్టుడు గణనాథుని ఆరాధించి తమ పనులను నిరాటంకంగా సాధించుకున్నారు.అలాగే దేవతా సమూహంలో గణపతికి విశిష్టమైన స్థానం ఉంది.అందుచేత భక్తులు 11, 16, 21, 27, 32 మంగళవారాల పాటు స్వామి దర్శం చేసుకుని ప్రదక్షిణలు చేయడం వల్ల సకల శుభాలు జరుగుతాయని పండితులు చెప్పుతూ ఉంటారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube