కాల్చిన సీతాఫలం తినడం వల్ల ఇ న్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయా..

చలికాలంలో చాలామంది ఎక్కువగా చలికి బయటికి రాకుండా ఉంటారు.దీనివల్ల చాలామందిలో ఎక్కువగా అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి.

 Health Benefits Of Roasted Custard Apple,roasted Custard Apple,custard Apple,imm-TeluguStop.com

ఇంకా చెప్పాలంటే చలికాలంలో చాలామంది ప్రజలలో రోగనిరోధక శక్తి కూడా తగ్గుతుంది.దీని మూలంగా ఎన్నో రకాల అనారోగ్య సమస్యలకు గురవుతూ ఉంటారు.

చలికాలంలో ఎన్నో రకాల పండ్లు మార్కెట్లో లభిస్తూ ఉంటాయి.వాటిలో ముఖ్యమైనది సీతాఫలం.

బాగా పండిన సీతాఫలాలు తీయగా ఉంటాయి.అందుచేత సీతాఫలాలను ఇష్టపడని వారు ఎవ్వరూ ఉండరు.

అయితే చాలా గిరిజన ప్రాంతాలలో సీతాఫలాలను కాల్చుకునీ కూడా తింటూ ఉంటారు.ఇలా తినడం మెట్రో నగరాల్లో ఉన్న వారికి వింతగా అనిపించొచ్చు కానీ పూర్వకాలం నుంచి గ్రామాల్లో ఇలా సీతాఫలాలు కాల్చుకుని తినే అలవాటు కూడా ఉంది.

ఇలా కాల్చుకుని తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.చక్కెర వ్యాధి ఉన్నవారికి కాల్చిన సీతాఫలాలు ఎంతో మేలు చేస్తాయి.కాలిపోయినప్పటికీ లోపలి మాత్రం తెల్లటి పదార్థం చక్కగా ఉంటుంది.అది మరింత తీయగా అవుతుంది.

సీతాఫలం నేరుగా కాకుండా ఇలా కాల్చుకొని తింటే చక్కెర రోగులకు ఎంతో మంచిది.

Telugu Cud Apple, Tips, Heath Tips, Immunity-Telugu Health

ఇలా తినడం వల్ల రోగనిరోధక శక్తి కూడా పెరిగే అవకాశం ఉంది.అయితే ఇలా సీతాఫలాన్ని కాల్చుకొని తినడం వల్ల శరీరానికి అవసరమయ్యే పోషకాలు ఎన్నో లభిస్తాయి.దీనిలోని యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి.

యాంటీ క్యాన్సర్ లక్షణాలు సీతాఫలంలో ఎన్నో ఉన్నాయి.ఈ పండ్లను కాల్చడం వల్ల లోపల ఉండే గుజ్జులో ఈ లక్షణాలు మరింత పెరిగే అవకాశం ఉంది.

మలబద్ధకం, గ్యాస్ లాంటి సమస్యలతో బాధపడే వారికి కాల్చిన సీతాఫలం తినడం వల్ల ఉపశమనం ఉంటుంది.

ఇంకా చెప్పాలంటే ఇవి తినడం వల్ల బాడీపెయిన్స్ కూడా తగ్గుతాయి.

కంటి చూపు మెరుగుపడుతుంది.బరువు పెరగాలని అనుకునే వారికి కాల్చిన సీతాఫలంలో తేనె కలుపుకొని తింటే త్వరగా బరువు పెరుగుతారు.

సీతాఫలాన్ని గ్యాస్ స్టవ్ మీద కాల్చడం కాదు కానీ బొగ్గులు తెచ్చి వాటిపై కాల్చడం లేదా చిన్న చిన్న కట్ట వేసి మట్టిపై పెట్టి కాల్చడం మంచిది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube