దేవాలయంలో తీర్థం తీసుకునేటప్పుడు పాటించాల్సిన ముఖ్యమైన నియమాలు ఇవే..!

ముఖ్యంగా చెప్పాలంటే భగవంతుని దర్శనం చేసుకున్న తర్వాత తీర్థం తీసుకోవడం పూర్వం నుంచి ఆనవాయితీగా వస్తూ ఉంది.బహుశా తీర్థం తీసుకోకుండా దేవాలయం నుంచి ఎవరు కూడా బయటకి వెళ్ళరు.

 These Are The Important Rules To Follow While Taking Pilgrimage To The Temple ,-TeluguStop.com

హిందూ మతంలో తీర్థానికి ఎంతో ప్రాముఖ్యత ఉందని దాదాపు చాలా మందికి తెలుసు.తీర్థం( Theertham ) అనేక రూపాలలో ఉంటుంది.

ముఖ్యంగా చెప్పాలంటే హిందూ మత విశ్వాసాల ప్రకారం తీర్థం తీసుకునేటప్పుడు కొన్ని నియమాలను కచ్చితంగా పాటించాలి.భగవంతుని అనుగ్రహానికి ఇదొక్కటే మార్గమని పండితులు చెబుతున్నారు.

Telugu Bhakti, Devotional, Hindu, Holy, Lord Brahma, Temple, Theertham-Latest Ne

తీర్థం తీసుకునేటప్పుడు ఈ నియమాలను కచ్చితంగా పాటించాలని పండితులు చెబుతున్నారు. హస్తగోకర్ణ ముద్రతో తీర్థాన్ని తీసుకోవాలని పండితులు చెబుతున్నారు.కొందరు కుడి చేతితో మాత్రమే తీర్థం తీసుకుంటూ ఉంటారు.కానీ ఇది సరైన పద్ధతి కాదు.తీర్ధం తీసుకునేటప్పుడు కుడి చేతిని ఎడమ చేతి పై ఉంచాలి.బొటనవేలు మరియు చూపుడు వేలు మడిచి మిగిలిన మూడు వెళ్ళను ముందుకు చాచాలి.

ఈ ముద్ర లో భగవంతుని పవిత్ర జలాన్ని తీసుకోవాలి.ఇంకా చెప్పాలంటే తీర్థం సేవించేటప్పుడు శబ్దం అస్సలు చేయకూడదు.

అలాగే తీర్థం కింద పడకూడదు.తీర్థం ఇతరులకు పంచడం లాంటివి చేయకూడదు.

Telugu Bhakti, Devotional, Hindu, Holy, Lord Brahma, Temple, Theertham-Latest Ne

ఓం అచ్యుత, అనంత, గోవింద నామాలను స్మరిస్తూ భక్తితో భగవంతుని స్మరించి తీర్థం సేవించాలి.ఇంకా చెప్పాలంటే తీర్థం తీసుకున్న తర్వాత చాలామంది తమ కుడిచేతిని తలపై పెట్టుకుంటూ ఉంటారు.కానీ ఇలా చేయకూడదని పండితులు చెబుతున్నారు.ఎందుకంటే బ్రహ్మదేవుడు తల పై ఉన్నాడు.ఇలా చేయడం వల్ల మనం బ్రహ్మ దేవు( Lord Brahma )ని అవశేషాలను తాకుతాము.అందుకే తీర్థం సేవించిన తర్వాత చేతులు రుద్దకూడదు.

అలాగే కొన్ని చోట్ల మూడుసార్లు తీర్థం తీసుకోవాలని చెబుతూ ఉంటారు.ఈ విషయం గురించి చాలా మందికి తెలియదు.

మొదటిసారిగా అందించే తీర్థం శరీరక మరియు మానసిక శుద్ధి కోసం సమర్పిస్తారు.రెండవసారి న్యాయ ధర్మా ప్రవర్తన సరిగ్గా ఉండాలని తీసుకుంటూ ఉంటారు.

మూడవసారి పవిత్రమైన భగవంతుని యొక్క సర్వోన్నత వాక్యాన్ని ఆలోచించి తీర్ధాన్ని తీసుకోవాలనీ పండితులు చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube