మన ఇంట్లో ఆర్ధిక ఇబ్బందులు ఉంటాయ్.అయితే అలాంటి పనులు తొలిగిపోవాలంటే గురువారం రోజు కొన్ని పనులు చెయ్యకూడదని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.
మరి ఆ పనులు ఏంటి? ఆ పనులు చేస్తే కలిగే నష్టాలు ఏంటి అనేది తెలుసుకుందాం.
బృహస్పతి గ్రహానికి అత్యంత ప్రీతికరమైన రోజు గురువారం.
ఈ గ్రహం మన శరీరానికి సంబంధించింది.వాస్తు ప్రకారం మన ఇంటికి ఈశాన్య దిశ బృహస్పతి అని నమ్ముతారు.
అలాంటి గురువారం పూట మహిళలు తలస్నానం చేయకూడదట.మహిళల జాతకంలో బృహస్పతి భర్త కారకం.
ఈ కారణంగా బృహస్పతి ఆధిపత్యం వహించే రోజు మహిళలు తలస్నానం చేయకూడదు అంటారు.
ఇలా చేయడం ద్వారా ఇంట్లో శుభకార్యాలు జరగకపోవడం, అనారోగ్య సమస్యలు రావడం జరుగుతుందట.
ఇంకా గురువారం జుట్టు కత్తిరించ కూడదు.గురువారం స్నానం చేసి ఇష్ట దైవానికి పూజ చేసుకోవాలి, వీలైనంత వరకు పసుపు రంగు బట్టలు ధరించడం, పసుపు రంగు పూలతోనే పూజ చేయడం చాలా మంచిది.
పసుపు రంగు మిఠాయిలను నైవేద్యంగా పెట్టాలి.
అలాగే గురువారం అరటి చెట్టుకు పూజ చేయడం ద్వారా అనుకున్న కార్యక్రమాలు దిగ్విజయంగా పూర్తి అవ్వడం మాత్రమే కాకుండా అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి.
అరటి చెట్లు వేళ్ళ వద్ద పసుపు నీళ్లు చల్లి నేతి దీపం వెలిగించి హారతి ఇవ్వాలి.ఇలా చేయడం ద్వారా ఆర్థిక ఇబ్బందులు తొలగి, కోరిన కోరికలు నెరవేరుతాయని వేద పండితులు చెబుతున్నారు.