సన్ స్క్రీన్.చర్మ ఆరోగ్యానికి ఇది ఒక రక్షణ కవచం అనడంలో సందేహం లేదు.
ఎక్కువ శాతం మంది వేసవి కాలంలోనే చర్మానికి సన్ స్క్రీన్ లోషన్ ను రాసుకుంటారు.కానీ సీజన్ ఏదైనా బయటకు వెళ్లే ముందు కచ్చితంగా సన్ స్క్రీన్ ను రాసుకోవాలని చర్మ నిపుణులు చెబుతున్నారు.
సూర్యుని నుంచి వచ్చే హానికరమైన అతినీలలోహిత కిరణాల వల్ల చర్మంపై నల్లటి మచ్చలు ఏర్పడతాయి.చర్మం రంగు మారడం, ముడతలు పడటం, గీతలు, చర్మం వదులుగా మారడం వంటి వృద్ధాప్య ఛాయలు తలెత్తుతాయి.
ఒక్కోసారి చర్మ క్యాన్సర్( Skin cancer ) కి కూడా కారణం అవుతాయి.

ఈ సమస్యలకు దూరంగా ఉండాలి అంటే సన్ స్క్రీన్ ను వాడాల్సిందే.అయితే మార్కెట్లో లభ్యమైతే సన్ స్క్రీన్స్ లో ఎన్నో రకాల కెమికల్స్( Chemicals ) నిండి ఉంటాయి.వాటికి బదులు ఇంట్లోనే సన్ స్క్రీన్ ను తయారు చేసుకుని వాడితే బోలెడు స్కిన్ కేర్ బెనిఫిట్స్ ను పొందవచ్చు.
మరి ఇంకెందుకు ఆలస్యం ఇంట్లోనే సన్ స్క్రీన్ ను ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు ఆలివ్ ఆయిల్, రెండు టేబుల్ స్పూన్లు హోమ్ మేడ్ క్యారెట్ ఆయిల్, రెండు టేబుల్ స్పూన్లు స్వీట్ ఆల్మండ్ ఆయిల్( Almond oil ) వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ గిన్నెను మరుగుతున్న నీటిలో ఉంచి హీట్ చేయాలి.ఆయిల్ హీట్ అవ్వగానే రెండు టేబుల్ స్పూన్లు బీస్ వాక్స్( Beeswax ) వేసి మెల్ట్ అయ్యేవరకు హీట్ చేయాలి.
వాక్స్ మెల్ట్ అవ్వగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.

ఈ మిశ్రమం కాస్త చల్లారిన తరువాత రెండు టేబుల్ స్పూన్లు అలోవెరా జెల్,( Aloe Vera Gel ) నాలుగు చుక్కలు టీ ట్రీ ఎసెన్షియల్ ఆయిల్ వేసుకుని దాదాపు ఐదు నిమిషాలు పాటు ఆగకుండా బాగా కలుపుకోవాలి.ద్వారా మన హోమ్ మేడ్ సన్ స్క్రీన్ లోషన్ తయారు అవుతుంది.ఈ లోషన్ ను ఒక బాక్స్ లో నింపుకొని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవాలి.
రోజు ఈ హోమ్ మేడ్ సన్ స్క్రీన్ ను రాసుకుంటే చర్మం ఆరోగ్యంగా మారుతుంది.యవ్వనంగా, మృదువుగా మెరుస్తుంది.స్కిన్ హైడ్రేటెడ్ గా ఉంటుంది.ఎండల వల్ల చర్మం టాన్ అవకుండా ఉంటుంది.
వృద్ధాప్య ఛాయలు త్వరగా దరిచేరకుండా సైతం ఉంటాయి.







