ఇంట్లో ఉండే ఈ వస్తువులు పర్సులో పెడితే ఏమవుతుందో తెలుసా..?

ఈరోజుల్లో మనిషి జీవితాన్ని డబ్బే నడిపిస్తూ ఉంది.అయితే నీరు తాగుదామన్నా కూడా డబ్బు కావాల్సిన పరిస్థితి ఈ రోజుల్లో ఏర్పడింది.

 Do You Know What Happens If You Put These Household Items In Your Purse, Astrolo-TeluguStop.com

దీంతో డబ్బు సంపాదించడానికి చాలామంది ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు.కొందరు పగలనకా, రాత్రనకా ఎంత కష్టపడినా కూడా ఖర్చులకు సరిపోయినంత డబ్బు కూడా రావడం లేదు.

మరి కొందరికి ఎక్కువ ఆదాయం వచ్చినా కూడా చేతిలో నిలవకుండా ఖర్చులకే వెళ్ళిపోతున్నాయి.ఇలాంటి సమయంలో చాలామంది ఏం చేయాలో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు.

అయితే జ్యోతిష్య శాస్త్రం( Astrology ) ప్రకారం ఈ పనులు చేయడం వలన లక్ష్మీ కటాక్షం పొందే అవకాశం ఉందని కొందరు పండితులు చెబుతున్నారు.

Telugu Astrology, Cardamom, Devotional, Horoscope, Lakshmi Devi, Pacha Karpooram

ముఖ్యంగా చేతిలో ఉండే పర్సులో కొన్ని పదార్థాలను పెట్టుకోవడం వలన వద్దన్నా కూడా డబ్బు వస్తుందని చెబుతున్నారు.ఇంతకీ పర్సులో ఏ వస్తువులను పెట్టుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.సాధారణంగా మగవాళ్ళు, ఆడవాళ్ళు అందరూ కూడా పర్సు వాడతారు.

అయితే పర్సులో వివిధ రకాల కార్డులు, ముఖ్యమైన పేపర్స్ తో పాటు నగదును పెట్టుకుంటారు.ఇక అవసరాలకు సరిపోయినంత డబ్బు( Money )ను పర్సులో ఉంచి బయటకు వెళ్తారు.

డబ్బును పర్స్ లో ఉంచడం వలన ఎలాంటి డ్యామేజ్ కాకుండా ఉంటుంది.అంతేకాకుండా వర్షంలో కూడా పాడవకుండా ఉంటుంది.

అయితే కొందరు జీవితాల్లో ఉండే జాతక దోషాల వలన వారు ఎంత సంపాదించిన కూడా డబ్బు నిలవదు.

Telugu Astrology, Cardamom, Devotional, Horoscope, Lakshmi Devi, Pacha Karpooram

మరికొందరికి ఆదాయం వచ్చినట్లే మాయమవుతుంది.ఇలాంటివారు పర్సులో డబ్బు, పేపర్స్, కార్డులతో పాటు మరికొన్ని వస్తువులు ఉంచుకోవాలి.ముందుగా అరచేతిలో ఒక శుభ్రమైన గుడ్డను తీసుకోవాలి.

ఇది పచ్చని రంగులోని పట్టు వస్త్రం అయితే మంచిది.ఇందులో 5 ఏలకులు, సొంపు, కాసింత పచ్చ కర్పూరం ( Pacha Karpooram )వేసి, ఎర్రటి దారంతో ముడి వేయాలి.

ఇందులో నుండి ఆ వస్తువులు బయటపడకుండా గట్టిగా దారం కట్టాలి.ఇలా కట్టిన దాన్ని బుధవారం లేదా లక్ష్మీదేవికి అనుకూలమైన రోజులలో పర్సులో భద్రపరచుకోవాలి.

దీనిని జాగ్రత్తగా ఉంచుకోవడం వలన మీకు ఇక లక్ష్మీ కటాక్షం లభించి, ధన వృద్ధి కలుగుతుంది.దీంతో మీకు డబ్బుకు ఎలాంటి లోటు ఉండదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube