మన దేశంలో న్యూమరాలజీని ( Numerology ) చాలా మంది ప్రజలు నమ్ముతారు.ముఖ్యంగా చెప్పాలంటే న్యూమరాలజీ ప్రకారం 3, 12, 21, 30వ తేదీలలో జన్మించిన వారికి నంబర్ మూడు వర్తిస్తుంది.
నంబర్ మూడుకి సంబంధించిన లక్కీ కలర్,( Lucky Color ) అలాగే జీవితంలో పాజిటివ్ ఎనర్జీని మెరుగుపరచడానికి ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.నంబర్ 3కి అధిపతి బృహస్పతి.
ఈ నంబర్ కి చెందినవారు ప్రతిభ కలిగి ఉంటారు.పనిచేస్తున్న రంగంలో గొప్పతనాన్ని సాధించాలని కోరికలు ఎక్కువగా ఉంటాయి.
మీరు సమస్యలను పరిష్కరించడంలో గుర్తింపు పొందుతారు.

అలాగే వీరు వినూత్న మనస్తత్వాన్ని కలిగి ఉంటారు.వీరు తెలివైన నిర్ణయాలను తీసుకుంటారు.వీరి సహాయక నిస్వార్ధ స్వభావం, ఇతరులకు స్ఫూర్తినిస్తుంది.
నంబర్ 3 ప్రభావం ఉన్నవారికి అదృష్ట రంగు పసుపు.( Yellow ) చీకటి రోజులలో ఆనందాన్ని కలిగిస్తుంది.
అంతేకాకుండా నంబర్ మూడు వీరిలో సృజనాత్మకతను పెంచుతుంది.జ్ఞానాన్ని కూడా అందిస్తుంది.సంబంధిత వ్యక్తిలను మరింత అప్రమత్తంగా, శక్తివంతంగా ఉండేలా చేస్తుంది.ఇది సృజనాత్మక ఆలోచనలను కలిగిస్తుంది.నంబర్ 3 ఉన్నవారికి ఎల్లో కలర్ ఎంతో కీలకమైనది.

ఇంకా చెప్పాలంటే ఆఫీస్ ఉత్తర గోడ పై ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ను ఉంచాలి.ఇది పాజిటివ్ ఎనర్జీని కలిగిస్తుంది.అలాగే క్రియేటివిటీ ని కూడా పెంచుతుంది.
అలాగే జేబులో ఒక చిన్న ఎరుపు లేదా నారింజ రంగు వస్తువును ఉంచుకోండి.కీచైన్ లేదా రాయి కావచ్చు.
ఈ రంగులు మీకు అదృష్టాన్ని ఆకర్షిస్తాయి.మహిళలు సింధూరం మగవారు చందనాన్ని నుదుటి పై పెట్టుకోవాలి.
ఇది ఆశీర్వాదాలను సూచిస్తుంది.లక్కీ రంగు తో అనుబంధాన్ని పెంచుతుంది.
ఇంకా చెప్పాలంటే ఆఫీస్ కుర్చీ పక్కన ఎల్లో గోల్డెన్ ల్యాంప్ ఉంచుకోవాలి.ఇది సాఫ్ట్ గ్లో పాజిటివ్, ఉత్తేజకరమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది.
ఇంకా చెప్పాలంటే వర్క్ స్పేస్ లో మెటల్ వస్తువులకు బదులుగా చెక్క వస్తువులను ఉపయోగించాలి.వుడ్ ప్రకృతి బృహస్పతి గ్రహంతో సంబంధం కలిగి ఉంటుంది.
ఇది జీవితంలో సానుకూలత శక్తిని పెంచుతుంది.