Holi Festival : హోలీ పండుగ రోజున తెల్లని దుస్తులు.. ధరించడానికి గల కారణం ఏమిటో తెలుసా..?

మన దేశంలో జరుపుకునే అతి పెద్ద పండుగలో హోలీ పండుగ ( Holi festival )ఒకటి అని కచ్చితంగా చెప్పవచ్చు.హోలీని రంగులతో, ఆనందంతో ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు.

 Do You Know The Reason Behind Wearing White On Holi-TeluguStop.com

హోలీ పండుగ పరస్పర ప్రేమ, సోదర భావాన్ని పెంచేందుకు జరుపుకుంటారు.హోలీ వివిధ రంగుల పండుగ.

అయితే హోలీ ఆడే సమయంలో తెల్లని దుస్తులు ధరించే ఆచారం కూడా ఉంది.హోలీ రోజు తెల్లని దుస్తులు( white dress ) ధరించడం వెనుక కొన్ని కారణాలు ఉన్నాయి.

ఆ కారణాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Telugu White Holi, Tips, Holi, Photographs, White-Latest News - Telugu

అలాగే హోలీ ఆడుతున్నప్పుడు తెల్లని దుస్తులు ధరించడానికి అతి ముఖ్యమైన కారణం ఏమిటంటే తెల్లని దుస్తుల పై రంగు పడినప్పుడు దుస్తులు కూడా పూర్తిగా అదే రంగులోకి వస్తాయి.ఇది చాలా అందంగా కనిపిస్తుంది.చల్లుకున్న అన్ని రంగులు తెల్లని దుస్తుల పై చాలా బాగా కనిపిస్తాయి.

దీని వల్ల దుస్తువులు చాలా అందంగా కనిపిస్తాయి.మీ తెల్లని దుస్తువులు కూడా మీరు హోలీని ఎక్కువ లేదా తక్కువ ఆడారా అనే విషయాన్ని తెలియజేస్తాయి.

ఎందుకంటే మీరు తక్కువ హోలీ అడిగితే మీ తేల్లని బట్టల పై రంగు ఎక్కువగా పడదు.

Telugu White Holi, Tips, Holi, Photographs, White-Latest News - Telugu

మీరు ఎక్కువ హోలీ అడిగితే తెల్లని దుస్తులు పూర్తిగా వేరువేరు రంగులతో మారుతాయి.రంగులతో కూడిన ఈ దుస్తులలో ఫోటోగ్రాఫ్‌లలో ( photographs )కూడా చాలా అందంగా కనిపిస్తాయి.అలాగే హోలీ పండుగ తో వేసవికాలం మొదలవుతుంది.

తెలుపు రంగు తక్కువ వేడిని ప్రతిబింబిస్తుంది.అందుకే తెలుపు రంగు దుస్తులు ధరించడం వల్ల వేడి తగ్గిపోతుంది.

ఇంకా చెప్పాలంటే హోలీ అనేది పరస్పర ప్రేమ, సోదర భావానికి సంబంధించిన పండుగ.హోలీ రోజున ప్రజలు పరస్పర శత్రుత్వాన్ని, వైరాగ్యాన్ని మరిచిపోయి ఒకరినొకరు ప్రేమతో అలింగం చేసుకొని కలిసి ఈ పండుగను జరుపుకోవాలి.

తెలుపు రంగు శాంతికి చిహ్నంగా పరిగణిస్తారు.ఈ కారణంగా కూడా హోలీ సమయంలో ప్రజలు తెల్లని దుస్తులు ధరిస్తారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube