ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):
సూర్యోదయం: ఉదయం 5.56
సూర్యాస్తమయం: సాయంత్రం.6.48
రాహుకాలం: ఉ.7.30 ల9.00
అమృత ఘడియలు: ఉ.9.00 ల10.30 మ3.50 సా4.50
దుర్ముహూర్తం: మ.12.47 ల1.38మ3.20 సా4.11
మేషం:
ఈరోజు మీకు ముఖ్యమైన శ్రద్ధ అవసరం.కొన్ని దూర ప్రయాణాలు చేసేటప్పుడు ఆటంకాలు ఎదురవుతాయి.కొన్ని ముఖ్యమైన విషయాల గురించి అనుభవం ఉన్న వ్యక్తుల నిర్ణయాలు తీసుకోవడం మంచిది.దగ్గరి వారితో విభేదాలు రాకుండా చూసుకోవాలి.కాలం వ్యతిరేకంగా ఉంటుంది.
వృషభం:
ఈరోజు మీరు సమాజంలో గౌరవ మర్యాదలను పొందుతారు.ఇంట్లో వారితో చర్చించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది.దూరపు బంధువుల నుండి ఒక శుభవార్త వింటారు.
అది మీ మనసుకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది.మీరంటే గిట్టని వారికి దూరంగా ఉండడం మంచిది.
మిథునం:
ఈరోజు నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రయత్నించాలి.మీరు చేసే పొరపాట్ల వలన కుటుంబ సభ్యులు మానసిక ఒత్తిడికి గురై అవకాశం ఉంది.విద్యార్థుల విదేశాల్లో చదవాలనే ఆలోచనలో ఉంటారు.మీ చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు.వారితో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.
కర్కాటకం:
ఈరోజు మీరు చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి.అధికారులు లేదా పెద్దలను తెప్పించడానికి కాస్త కష్టపడాల్సి వస్తుంది.ఆరోగ్యం గురించి నిర్లక్ష్యం చేయడం మంచిది కాదు.
మీ కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.
సింహం:
ఈరోజు మీరు పరిస్థితులకు అనుకూలంగా ముందుకు సాగితే తప్పక విజయం సాధిస్తారు.కుటుంబ సభ్యులతో ఉత్సాహపరిచే కార్యక్రమాల్లో పాల్గొంటారు.భూమికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాల గురించి సోదరులతో చర్చలు చేస్తారు.మీ తండ్రి యొక్క ఆరోగ్యం కుదుటపడుతుంది.
కన్య:
ఈరోజు మీ తొందరపాటుతో ఎటువంటి నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది.మీరు చేసే ఉద్యోగంలో శ్రమ పెరుగుతుంది.శత్రువులతో ఆచితూచి వ్యవహరించడం.అనవసరమైన విషయాల్లో తలదూర్చకండి.మీ స్నేహితుల సహాయంతో కొన్ని పనులను పూర్తి చేస్తారు.ధైర్యంతో ముందుకు వెళ్లాలి.
తుల:
ఈరోజు మీరు అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు.మీ కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేయడానికి ఈరోజు మీకు ఎంతో అనుకూలంగా ఉంది.గతంలో పెట్టుబడుల నుండి మంచి లాభాలను అందుకుంటారు.
వృశ్చికం:
ఈరోజు మీరు అనవసరంగా డబ్బు ఎక్కువగా ఖర్చు చేస్తారు.కొన్ని చెడు సావాసాలకు దూరంగా ఉండడమే మంచిది.మీరు చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల మీ కుటుంబ సభ్యులు మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది.మీరంటే గిట్టని వారు మీ విషయాలు జోక్యం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు.
ధనుస్సు:
ఈరోజు మీరు అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించి మనశ్శాంతి కోల్పోతారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.కొన్ని ప్రయాణాలు చేయకపోవడం మంచిది.కొందరు వ్యక్తులు నమ్మించి ద్రోహం చేస్తారు.వారితో జాగ్రత్తగా ఉండాలి.ఈరోజు అనుకూలంగా లేదు.
మకరం:
ఈరోజు మీరు ఆర్థికంగా కొన్ని నష్టాలు ఎదుర్కొంటారు.దీనివల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.ఇతరులు మీకు సహాయం చేయడానికి ముందుకు వస్తారు.కానీ భవిష్యత్తులో కొన్ని సమస్యలు వస్తాయి.అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వచ్చే అవకాశం ఉంది.
కుంభం:
ఈరోజు మీరు తీరిక లేని సమయంతో గడుపుతారు.కొన్ని ప్రయాణాలు వాయిదా వేస్తారు.ఆర్థికంగా అనుకూలంగా ఉంది.
ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.బంధువుల నుండి శుభవార్త వింటారు.
నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రయత్నించాలి.మీ చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు.
మీనం:
ఈరోజు మీరు ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.దీనివల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.అనుకోకుండా మీ పాత స్నేహితులను కలుస్తారు.వారు కాస్త ధైర్యం ఇస్తారు.పిల్లల భవిష్యత్తు గురించిఆలోచించాలి.మీరు పనిచేసే చోట ఇతరుల సహాయం అందుకుంటారు.
DEVOTIONAL