లక్ష్మీ దేవి ఇష్టపడాలంటే మహిళలు ఎలా ఉండాలి..?

లక్ష్మీ దేవి కటాక్షం కోసం కొంత మంది చేయని పని అంటూ ఉండదు.ఇంట్లో ఎప్పుడు లక్ష్మీ దేవి ఉండాలంటే మాత్రం కొన్ని నియమాలు పాటించాల్సిందే.

 How Should Be Women To Like By Goddess Lakshmi Devi , Devotional, Laxmidevi , Ma-TeluguStop.com

అవి కచ్చితంగా అమలు చేస్తేనే ధన లాభం కలుగుతుంది.చేతినిండా డబ్బు ఉంటుంది.

పట్టిందల్లా బంగారం అవుతుంది.ఒక రోజు వైకుంఠంలో ఉన్న లక్ష్మీ దేవి మందిరానికి రుక్మిణీ దేవి వెళ్లింది.

ఇద్దరూ పరస్పరం తారసపడుకున్నారు.పలు అంశాలపై చర్చించుకున్నప్పుడు రుక్మిణీ దేవి లక్ష్మీ దేవిని ఒక విషయం అడిగింది.

సోదరీ నువ్వు ఎలాంటి మహిళల వద్ద ఉండటానికి ఇష్టపడతావు, ఏ స్త్రీలు అంటే నీకు ప్రియమైన వారుగా ఉంటారు అని అడుగుతుంది.నీకు ప్రీతిపాత్రంగా ఉండటానికి ఆడవాళ్లు ఏం చెయ్యాలని ప్రశ్నిస్తుంది.

రుక్మిణీ అడిగిన ప్రశ్నకు లక్ష్మీ దేవి నవ్వి తనకు ఎలాంటి స్త్రీలు అంటే ఇష్టమో చెబుతుంది.తన స్వామి పట్ల అచంచల భక్తి ఉన్నా వారిని తను ఎప్పటికీ వదిలి ఉండనని చెప్పింది.

సమస్త గుణాలు ఉన్న తన భర్తను గౌరవించని స్త్రీలని నేను తిరస్కరిస్తానని చెబుతుంది.అలాంటి వారిని నా దగ్గరికిరానివ్వనని వెల్లడిస్తుంది.ఇతరుల అపరాధాలను మన్నించే క్షమాగుణం కలిగిన స్త్రీ ఇంట్లో నేను నివసిస్తానని చెబుతోంది.ఎప్పుడూ నిజం చెప్పేవారు, మోసం చేయని వారు బాధపెట్టే వారిని ఎంత మాత్రం ఇష్టపడనని చెబుతుంది.

పవిత్రంగా ఉండి, నిర్దిష్టమైన నడవకి కలిగి, దేవతలను, బ్రాహ్మణులను పూర్తి గౌరవాలతో చూసే స్త్రీలు, పతివ్రతలైన స్త్రీలంటే తనకు ఇష్టమని లక్ష్మీ దేవి వెల్లడిస్తుంది.అతిథి సేవ చేయాలని కోరే స్త్రీలు, నన్ను సులభంగా పొందగలరని అంటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube