ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):
సూర్యోదయం: ఉదయం 05.59
సూర్యాస్తమయం: సాయంత్రం 06.45
రాహుకాలం: ఉ.7.30 నుంచి 04.00 వరకు
అమృత ఘడియలు: ఉ.04.00 నుంచి 06.00 వరకు
దుర్ముహూర్తం: మ.12.47 నుంచి 1.38 వరకు
ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):
మేషం:
ఈరోజు వ్యాపారదారులకు అనుకూలంగా ఉంటుంది.ఆర్థిక పరంగా లాభాలు అందుకుంటారు.విద్యార్థులు విదేశాల్లో చదవాలనే ఆలోచనలో ఉంటారు.కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.
వృషభం:
ఈరోజు మీరు పని విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.కొన్ని కోర్టు సమస్యల నుండి బయట పడతారు.తరచూ మారే మీ నిర్ణయాల వలన కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.అనవసరమైన విషయాలలో తలదూర్చకుండా ఉండడమే మంచిది.
మిథునం:
ఈరోజు మీరు ఇంటి నిర్మూలన గురించి అనుభవం ఉన్న వ్యక్తులతో చర్చలు చేయడం మంచిది.బయట ఇచ్చిన డబ్బు ఇచ్చినట్టుగా తిరిగి మీ చేతికి సమయానికి అందుతుంది.ఇరుగు పొరుగు వారితో వాదనలకు దిగే అవకాశం ఉంది.
కర్కాటకం:
ఈరోజు మీరు కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని దూరపు ప్రయాణాలు చేస్తారు.ప్రయాణం చేసేటప్పుడు కొన్ని విలువైన వస్తువులు కోల్పోయే అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.కొందరి ఊహించని వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి.
సింహం:
ఈరోజు మీరు భూమి కొనుగోలు చేస్తారు.తోటి వారి సహాయంతో అనుకున్న పనులన్నీ అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.మీ జీవిత భాగస్వామితో కలిసి బయట సమయాన్ని కాలక్షేపం చేస్తారు.
కన్య:
ఈరోజు మీలో బలహీనత ఎక్కువగా ఉంటుంది.మీరు చేసే పనులు నిదానంగా పూర్తి చేస్తారు.కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి.
నిరుద్యోలకు ఉద్యోగ అవకాశం ఉంటుంది.కొన్ని చెడు అలవాట్లకు దూరంగా ఉండటం మంచిది.
తులా:
ఈరోజు మీరు స్నేహితుల వలన కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.మీరు చేసే చిన్న చిన్న పొరపాటు వలన కుటుంబ సభ్యులు మానసిక ఒత్తిడికి గురై అవకాశం ఉంది.కొన్ని ముఖ్యమైన విషయాలలో నిర్లక్ష్యం ఎక్కువగా చేస్తారు.బయట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.
వృశ్చికం:
ఈరోజు మీరు సమాజంలో గౌర ప్రతిష్టలు పొందుతారు.కొందరి ముఖ్యమైన వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి.వారితో మీరు ప్రారంభించిన పనుల గురించి చర్చలు చేస్తారు.మీరు మొదలు పెట్టిన పనుల్లో అంతా శుభమే జరుగుతుంది.
ధనస్సు:
ఈరోజు మీరు అప్పు తీర్చాలనే ఆలోచనలో ఉంటారు.మీరు చేసే ఉద్యోగంలో పైఅధికారుల నుండి ప్రశంసలు పొందుతారు.ఇతరులతో మీ వ్యక్తిగత విషయాలు పంచుకోవడం వలన కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.
మకరం:
ఈరోజు మీరు ఎప్పటినుండో వాయిదా పడ్డ పనులన్నీ పూర్తి చేస్తారు.స్నేహితులతో బయట సమయాన్ని కాలక్షేపం చేస్తారు.ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.అనవసరమైన విషయాలకి ఆలోచనలు ఎక్కువగా చేస్తారు.
కుంభం:
ఈరోజు మీరు కుటుంబ సభ్యులతో కలిసి బంధువుల ఇంటికి వెళ్తారు.అక్కడ కొందరి కొత్త వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి.పిల్లల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి.అనవసరమైన విషయాలలో తలదూర్చకుండా ఉండడమే మంచిది.
మీనం:
ఈరోజు మీ తండ్రి యొక్క ఆరోగ్యం కుదుట పడుతుంది.విద్యార్థులు చదువుపై కాకుండా ఇతర విషయాలపై కూడా దృష్టి పెడతారు.ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళితే అంతా మంచే జరుగుతుంది.
తొందరపాటు నిర్ణయాలు పనికిరావు.
LATEST NEWS - TELUGU