వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆ దర్శనం చేస్తే పునర్జన్మ ఉండదా..

మన దేశ వ్యాప్తంగా చాలా మంది ప్రజలు సంవత్సరంలో వచ్చే ప్రతి పండుగను కుటుంబ సభ్యులందరితో కలిసి ఎంతో ఘనంగా, వైభవంగా జరుపుకుంటారు.కొన్ని పండుగల రోజులలో కొన్ని మంత్రాలను జపిస్తూ జరుపుకుంటే శుభం జరుగుతుందని కూడా చాలామంది ప్రజలు భావిస్తారు.

 If You Do That Darshan On The Occasion Of Vaikuntha Ekadashi, Won't You Be Rebor-TeluguStop.com

జనవరి రెండవ తేదీన వైకుంఠ ఏకాదశి రోజున నారాయణ మంత్రాన్ని జపించడం ద్వారా సర్వ శుభాలు జరుగుతాయని వేద పండితులు చెబుతున్నారు.అంతే కాకుండా ఈ రోజున శ్రీ మహావిష్ణువుని పూజిస్తే అమ్మ లక్ష్మీదేవి అనుగ్రహం కుటుంబ సభ్యులకు ఎప్పుడు ఉంటుందని చెబుతున్నారు.

ప్రతి రోజు శ్రీ హరినీ పూజిస్తే ఎలాంటి బాధలు లేకుండా సంపదతో పాటు సిరిసంపదలు కూడా అభివృద్ధి చెందుతాయని చెబుతున్నారు.

సంవత్సరంలో వచ్చే 12 నెలలలో 11వ మాసం పుష్య మాసం, ఈ మాసంలో వచ్చే పౌర్ణమికి ముందు శుక్లపక్ష ఏకాదశినే ఉత్తర ద్వార దర్శన ఏకాదశి, ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి అని చెబుతూ ఉంటారు.

ఈ ఏకాదశి రోజున స్వామి వారి దేవాలయాలలో ఉత్తరం వైపు ఉన్న ద్వారం నుంచి ఆలయంలోకి ప్రవేశాన్ని కల్పిస్తారు.ఇలా స్వామి వారిని దర్శించుకున్న వారికి పునర్జన్మ ఉండదని మోక్షం ఖాయమని వేద పండితులు చెబుతున్నారు.

అంతే కాకుండా తెలుగు రాష్ట్రాలలో ఘనంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు మొదలయ్యాయి.తెలుగు రాష్ట్రాలలోని ప్రముఖ దేవాలయాలు భక్తులతో రద్దీగా ఉన్నాయి.అన్నవరం, భద్రాచలం, మంగళగిరి, ధర్మపురి, విజయవాడ దేవాలయాలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది.తిరుమాల లో శ్రీవారి ఉత్తర ద్వార దర్శనం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది.ఇంకా చెప్పాలంటే తిరుమలలో ఉత్తర ద్వార దర్శనం ద్వారా దర్శనానికి భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది.నూతన సంవత్సరం మొదలైనప్పటి నుంచి ప్రతి రోజు 80,000 మంది భక్తులకు శ్రీవారి దర్శన భాగ్యం కల్పిస్తున్నామని ఆలయ ప్రముఖ అధికారులు వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube