హైదరాబాద్ లో బీఆర్ఎస్ నేతలతో ఆ పార్టీ అధినేత కేసీఆర్( BRS KCR ) నిర్వహించిన భేటీ ముగిసింది.ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్న కేసీఆర్ రూ.500 ల బోనస్ కోసం పంట కల్లాల వద్ద పోరాటాలకు పిలుపునిచ్చారు.తెలంగాణలో సుమారు ఎనిమిది పార్లమెంట్ స్థానాల్లో బీఆర్ఎస్ విజయం సాధిస్తుందని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు.
ఈ క్రమంలోనే క్షేత్రస్థాయిలో పరిస్థితులు తమకు అనుకూలంగా మారుతున్నాయని ఆయన పేర్కొన్నారు.ఎన్నికల నేపథ్యంలో అందరూ సమన్వయంతో పని చేయాలని కేసీఆర్ సూచించారు.అనంతరం ఎమ్మెల్సీ కవిత( MLC Kavitha ) అరెస్టుపై కేసీఆర్ మాట్లాడుతూ.రాజకీయంగా కక్ష సాధింపు కోసమే కవితను అరెస్ట్ చేశారని తెలిపారు.
కవిత లిక్కర్ స్కాం( Delhi Liquor Scam )పై ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలు చూపలేదన్నారు.కవిత ఎలాంటి తప్పు చేయలేదని స్పష్టం చేశారు.