గర్భం దాల్చడం అనేది పెళ్లైన ప్రతి మహిళ ఒక అదృష్టంలా భావిస్తుంది.ప్రెగ్నెన్సీ సమయంలో కడుపులోని బిడ్డ ఆరోగ్యంగా ఎదగాలంటే ఆహార విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.
ఇక ప్రెగ్నెన్సీ సమయంలో ఎన్ని సమస్యలు ఎదురైనా.కడుపులోని బిడ్డ కోసం వాటిని ఎంతో ఆనందంగా ఎదుర్కొంటారు.
అయితే ఆ సమయంలో చాలా మంది కామన్‌గా ఎదుర్కొనే సమస్య నిద్రలేమి.అనేక కారణాల వల్ల ప్రెగ్నెన్సీ స్త్రీలకు సరిగ్గా నిద్ర పట్టదు.
అలాంటి వారు ఇప్పుడు చెప్పబోయే టిప్స్ ఫాలో అయితే.ప్రశాంతంగా నిద్ర పడుతుంది.సాధారణంగా చాలా మంది గర్భిణీ స్త్రీలు చేసే పొరపాటు.పగటి పూట కునుకు వేయడం.
ఇలా చేయడం వల్ల రాత్రి నిద్రకు ఆటకం ఏర్పడుతుంది.కాబట్టి, పగటి పూట నిద్రకు దూరం ఉంటే.
రాత్రి నిద్ర బాగా పడుతుంది.అలాగే రాత్రి సమయంలో త్వరగా, ప్రశాంతంగా నిద్ర పట్టాలంటే.
ఒక గ్లాస్ గోరు వెచ్చని పాలలో చిటికెడు యాలకుల పొడి కలిపి తీసుకోవాలి.
ఈ పాల మిశ్రమం నిద్రకు ఉపక్రమించేలా చేయడంతో పాటు నిద్రలేమిని కూడా దూరం చేస్తుంది.
ఇక ప్రెగ్నెన్సీ సమయంలో రాత్రి నిద్ర బాగా పట్టాలంటే.ఎక్కువ కార్బోహైడ్రేట్స్ ఉన్న ఆహారాలను తీసుకోవాలి.
ఎందుకంటే.ఇవి నిద్రను ప్రోత్సహిస్తాయి.
అలాగే అరటి పండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందన్న విషయం తెలిసిందే.అయితే నిద్రించే ముందు ప్రెగ్నెన్సీ స్త్రీలు ఒక అరటి పండు తీసుకుంటే.
త్వరగా మరియు ప్రశాంతంగా నిద్ర పడుతుంది.
అదేవిధంగా, ప్రెగ్నెన్సీ స్త్రీలు ప్రతి రోజు శరీరానికి సరిపడా నీరు ఖచ్చితంగా తీసుకోవాలి.
అప్పుడే నిద్ర బాగా పడుతుంది.ఇక ప్రెగ్నెన్సీ సమయంలో నిద్ర బాగా పట్టడానికి మరో సూపర్ టిప్ అంటే.
గోరు వెచ్చని నీటితో నిద్రించే ముందు స్నానం చేయాలి.ఇలా చేయడం వల్ల శరీరం రిలాక్స్ మోడ్‌లోకి వచ్చి.
త్వరగా నిద్ర పడుతుంది.ఇక నిద్రించే ముందు జంక్ ఫుడ్స్, ఆయిల్ ఫుడ్స్‌కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.
ఎందుకంటే, ఇవి నిద్రకు ఆటంకాన్ని కలిగిస్తాయి.