పాములు( Snakes ) అంటే చాలామందికి భయమే.అవి కనపడితేనే చాలు హడలిపోతారు మనలో చాలామంది.
అలాంటిది పక్కనే కనిపిస్తే మాత్రం ఊహించుకోవడమే భయం కదా.ఇలాంటి సంఘటన నిజంగానే తాజగా కడప జిల్లాలో( Kadapa District ) చోటుచేసుకుంది.రాత్రివేళ కడప జిల్లా వేంపల్లిలో ఓ వ్యక్తి తన స్కూటీని( Scooty ) ఇంటి ముందు పార్క్ చేశాడు.ఎటునుంచి వచ్చిందో తెలియదు కానీ.ఒక పాము స్కూటీ ముందు భాగంలో దూరింది.ఈ విషయం తెలియని బండపల్లి శివకేశవరెడ్డి ఆ స్కూటీపై పులివెందుల రోడ్డులో నుంచి రాజీవ్ నగర్ కాలనీ వైపుగా వెళ్తుండగా.
అకస్మాత్తుగా పాము స్కూటీ ముందుభాగం నుంచి బయటకొచ్చింది.

దానితో స్కూటీలో పాము ఉందని తెలుసుకున్న శివకేశవరెడ్డి ఒక్కసారిగా షాక్ అయ్యాడు.వెంటనే స్కూటీని పక్కన ఆపి కేకలు వేశాడు.ఆ తర్వాత బైక్ మెకానిక్‌కు సమాచారం ఇచ్చాడు.
స్థానికులు, టీవీఎస్ షోరూం సిబ్బంది కలిపి 10 మంది, దాదాపు రెండు గంటల పాటు స్కూటీ పార్ట్స్ అన్నీ రిమూవ్ చేశారు.అయినా పాము బయటకు రాలేదు.

చివరికి ఓ పైపులో దాక్కున్న పాము కట్ల పాముగా తేలింది.ఇలాంటి కట్ల పాములు నివాస ప్రాంతాల్లోకి చొరబడటం సాధారణమే.అవి ఎక్కడ దాక్కుంటాయో తెలియదు.అందుకే ఇంటి వద్ద పార్క్ చేసిన వాహనాలను చెక్ చేసుకోవడం మంచిది.ఈ సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.స్కూటీలో పాము దాక్కోవడం అనేది ఊహించలేనిది కదా! ఈ వీడియో చుసిన నెటిజన్స్ వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.
మరి ఈలాంటి ఘటన మీకు ఎదురైతే ఎలా ఉంటుందో ఓ కామెంట్ చేయండి.