ఆ వంటకాలు ఇష్టమని చెబుతున్న రీతూ వర్మ.. మూడు పూటలు తినగలనంటూ?

సినిమా ఇండస్ట్రీలోని సెలబ్రిటీలు( Celebrities ) అంత వయసు వచ్చినా కూడా అంత యంగ్ గా, అందంగా కనిపించడానికి కారణం వారు తీసుకునే జాగ్రత్తలు, తీసుకునే ఫుడ్ అని చెప్పవచ్చు.ఫుడ్ విషయంలో చాలా రకాల జాగ్రత్తలు పాటిస్తూ ఉంటారు.

 Heroine Ritu Varma Food Taste, Ritu Varma, Food, Favourite Food, Tollywood, Comm-TeluguStop.com

ఏది పడితే అది తినకుండా కేవలం మంచి ప్రోటీన్లు విటమిన్లు కలిగిన ఆహారం మాత్రమే తీసుకుంటూ ఉంటారు.అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రత్యేకమైన అభిరుచి ఉంటుంది.

తలకు కూడా ఒక ప్రత్యేకమైన అభిరుచి ఉంది అంటోంది హీరోయిన్ రీతూ వర్మ( Ritu Verma ).ఇది అందరికీ కాస్త కామన్ గా అనిపించినప్పటికీ తనకు మాత్రం అదే ఇష్టం అంటోంది.

Telugu Favourite, Ritu Varma, Tollywood-Movie

తనకు సౌత్ ఇండియా టిఫిన్స్ అంటే చాలా ఇష్టం అని చెబుతోంది రీతూ వర్మ.అందులో ముఖ్యంగా ఇడ్లీ దోశ అంటే ఇంకా ఎక్కువ ఇష్టం అని చెబుతోంది.ఇడ్లీలో కాస్త కారంపొడి నెయ్యి వేసుకుని తింటే ఆ టేస్ట్ వేరే లెవెల్ అంటోంది.అలాగే తనకు 3 పూటలు ఇడ్లీ, దోశ ఇచ్చినా తింటానని, ఎలాంటి కంప్లయింట్ చేయనని చెబుతోంది.

కానీ ప్రతిరోజు మూడు పూటలా అది తినడం కరెక్ట్ కాదు కాబట్టి సెకండ్ ఆప్షన్ గా పప్పు అన్నం అంటే చాలా ఇష్టం అని చెబుతోంది.అలాగే తనకు కొత్త వంటకాలు ట్రై చేయడం కూడా ఇష్టమట.

విదేశాలకు వెళ్లినప్పుడు అక్కడి ఆహార పదార్థాలు టేస్ట్ చేస్తుంటానని చెబుతోంది.

Telugu Favourite, Ritu Varma, Tollywood-Movie

అలా తిన్నవాటిలో జపనీస్ రుచులంటే బాగా ఇష్టం ఏర్పడిందని, బయట రుచులు తినాలని మనసుకు అనిపించినప్పుడు జపనీస్ వంటకాల్ని ట్రై చేస్తుంటానని తెలిపింది.ఇకపోతే రీతూ వర్మ సినిమాల విషయానికొస్తే.త్వరలోనే మజాకా అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధంగా ఉంది రితూ వర్మ.

సందీప్ కిషన్ హీరోగా నటించిన ఈ సినిమాకు త్రినాధరావు నక్కిన దర్శకత్వం వహించారు.ఈ సినిమా ప్రచారంలో భాగంగా వంటకాల్లో తన ఇష్టాఇష్టాల్ని బయటపెట్టింది రీతూ వర్మ.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube