విశ్వంభర సినిమాలో వీణ సాంగ్.. వింటేజ్ చిరంజీవి కచ్చితంగా కనిపించనున్నారా?

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం డైరెక్టర్ వశిష్ట ( Director Vashishta )దర్శకత్వంలో విశ్వంభరా అనే మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే.ఈ సినిమా సంక్రాంతికి విడుదల కావాల్సి ఉండగా కొన్ని కారణాలవల్ల వాయిదా పడింది.

 Veena Step In Vishwambhara, Vishwambhara, Veena Step, Tollywood, Chiranjeevi-TeluguStop.com

ఈ సినిమాను సమ్మర్లో విడుదల చేస్తామంటూ మూవీ మేకర్స్ ప్రకటించారు.యు వి క్రియేషన్స్ బ్యానర్ లో ఈ సినిమా తెరకెక్కుతోంది.

ఎంఎం కీరవాణి ( MM Keeravani )మ్యూజిక్ ను అందిస్తున్నారు.అయితే చిరంజీవి సినిమాకు కీరవాణి మ్యూజిక్ అంటే అది సంథింగ్ స్పెషల్ అని చెప్పాలి.

చిరు సినిమాలో సాంగ్స్ అంటే డ్యాన్స్ ఉండేలా కూడా చేస్తారు.కానీ ఈ మధ్య చిరు సింపుల్ స్టెప్పు లతో కానిచ్చేస్తున్నారు.

Telugu Chiranjeevi, Tollywood, Veena Step, Veenastep, Vishwambhara-Movie

మరోసారి మెగాస్టార్ కాలు కదిపితే ఎలా ఉంటుందో విశ్వంభరలో చూపించబోతున్నారట.ముఖ్యంగా చిరు ఇంద్ర సినిమాలో వీణ స్టెప్ లాంటిది విశ్వంభర లో ప్లాన్ చేస్తున్నారట.మెగాస్టార్ చిరంజీవి వీణ స్టెప్పు వేస్తే ఎలా ఉంటుందో తెలిసిందే.విశ్వంభర మూవీలో( Vishwambhara ) మళ్లీ అలాంటి కంపోజింగ్ చేస్తే మాత్రం మెగా ఫ్యాన్స్ కి పండగ అన్నట్టే లెక్క.

కొన్నాళ్లుగా చిరంజీవి మార్క్ సినిమా రావట్లేదని ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కి విశ్వంభర మూవీ కచ్చితంగా మెగా మేనియా చూపిస్తుందని అంటున్నారు.వశిష్ట అటు కథ పరంగా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండానే మెగా ఫ్యాన్స్ కి కావాల్సిన కమర్షియల్ అంశాలు అన్నీ పెడుతున్నట్టు తెలుస్తోంది.

Telugu Chiranjeevi, Tollywood, Veena Step, Veenastep, Vishwambhara-Movie

మెగా విశ్వంభర నిజంగానే ఫ్యాన్స్ అంచనాలను మించి ఉంటే మాత్రం బాస్ బాక్సాఫీస్ షేక్ చేయడం గ్యారెంటీ అని చెప్పవచ్చు.భోళా శంకర్ సినిమాతో నిరాశ పడ్డ మెగా ఫ్యాన్స్ విశ్వంభరతో చిరు మంచి కంబ్యాక్ ఇవ్వాలని ఆశిస్తున్నారు.మరి చిరంజీవి వశిష్ట ఏం చేస్తారన్నది చూడాలి మరి.ఇకపోతే ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తుండగా ఆషిక రంగనాథ్ తో పాటుగా ఇషా చావ్లా కూడా నటిస్తున్న విషయం తెలిసిందే.మీనాక్షి చౌదరి కూడా ఒక ఇంపార్టెంట్ రోల్ లో కనిపిస్తుందని టాక్.చిరంజీవి సినిమా హిట్ టాక్ వస్తే ఆ కలెక్షన్స్ ఏ రేంజ్ లో ఉంటాయో తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube