అమెరికాలో చరిత్ర సృష్టించిన కాష్ పటేల్.. ఎఫ్‌బీఐ చీఫ్‌గా సెనేట్ ఆమోదం

అమెరికా అత్యున్నత దర్యాప్తు సంస్థ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ)( Federal Bureau of Investigation ) డైరెక్టర్‌గా భారత సంతతికి చెందిన కాష్ పటేల్( Kash Patel ) నియామకానికి సెనేట్ ఆమోదముద్ర వేసింది.అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్( President Donald Trump ) గెలిచిన వెంటనే కాష్ పేరును ఎఫ్‌బీఐ చీఫ్‌గా ప్రతిపాదించారు.

 Indian Origin Kash Patel Is Confirmed As Fbi Director By Us Senate Details, Indi-TeluguStop.com

దీనిపై సెనేట్‌లో ఓటింగ్ జరగ్గా 51-49 ఓట్ల తేడాతో ఆయన నియామకం ఖరారైంది.తద్వారా ఈ పదవిని చేపట్టిన తొలి హిందూ, తొలి భారతీయ అమెరికన్‌గా కాష్ పటేల్ రికార్డుల్లోకెక్కారు.

ఎఫ్‌బీఐ చీఫ్‌గా తన నియామకానికి ఆమోదముద్ర వేసిన వెంటనే కాష్ పటేల్ హర్షం వ్యక్తం చేశారు.తనకు ఈ అవకాశం కల్పించిన అధ్యక్షుడు ట్రంప్, అటార్నీ జనరల్ పామ్ బోండికి ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు.

దేశం గర్వించే విధంగా ఎఫ్‌బీఐని తీర్చిదిద్దుతామని , అమెరికన్ల జోలికి వస్తే వారి అంతు చూస్తామని కాష్ పటేల్ హెచ్చరించారు.

Telugu America, Fbi, Fbi Kash Patel, Federal Bureau, Indian, Indianorigin, Kash

గుజరాత్( Gujarat ) మూలాలున్న తల్లిదండ్రులకు న్యూయార్క్‌లో 1980లో జన్మించారు కాష్ పటేల్.తొలుత వీరి కుటుంబం ఆఫ్రికాలోని ఉగాండాలో స్థిరపడింది.అయితే అప్పటి ఆ దేశ నియంత ఈదీ ఆమిన్ వేధింపుల కారణంగా కాష్ తల్లిదండ్రులు అమెరికాకు వలస వచ్చారు.

యూనివర్సిటీ ఆఫ్ రిచ్‌మాండ్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన కశ్యప్.అనంతరం యూనివర్సిటీ కాలేజ్ లండన్‌లో లా పట్టా పొందారు.అనంతరం మియామీ కోర్టులలో పలు హోదాలలో పనిచేశారు.

Telugu America, Fbi, Fbi Kash Patel, Federal Bureau, Indian, Indianorigin, Kash

అమెరికా అధ్యక్షుడికి డిప్యూటీ అసిస్టెంట్‌గా, నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ (ఎన్ఎస్‌సీ)లో కౌంటర్ టెర్రరిజం సీనియర్ డైరెక్టర్‌గా సేవలందించారు.అతని డిపార్ట్‌మెంట్ ఆఫ్ డిఫెన్స్ ప్రొఫైల్ ప్రకారం.నేషనల్ ఇంటెలిజెన్స్ యాక్టింగ్ డైరెక్టర్‌కు ప్రిన్సిపల్‌ డిప్యూటీగా కూడా పనిచేశారు.

ఈ హోదాలో ఆయన 17 ఇంటెలిజెన్స్ కమ్యూనిటీ ఏజెన్సీల కార్యకలాపాలను పర్యవేక్షించడంతో పాటు అధ్యక్షుడి రోజువారీ బ్రీఫింగ్‌ను అందించేవారు.

ఇక రిపబ్లికన్ పార్టీకి ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్‌కు వీర విధేయుడిగా కాష్ పటేల్‌కు అమెరికా రాజకీయాల్లో పేరుంది.2020 అధ్యక్ష ఎన్నికల తర్వాత యూఎస్ కేపిటల్ వద్ద చోటు చేసుకున్న ఘటన కేసులో కశ్యప్ పటేల్ పేరు కూడా వినిపించింది.ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా గెలిచిన వెంటనే కాష్‌కు కీలక పదవి లభించడంతో వీరి బంధం మరింత బలోపేతమైంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube