పోచమ్మ, ఎల్లమ్మ, పెద్దమ్మ, బాలమ్మ, దేవమ్మ, నాగమ్మ, మైసమ్మ, కట్టమైసమ్మ, పోలేరమ్మ, మాంకాళమ్మ, మావూళ్లమ్మ… ఇలా ఏ దేవుడుకి పండుగ చేసినా… బోనాలు వాటికి వేప రెమ్మలు కట్టడం మన సంప్రదాయం. అసలు అమ్మ వారికి వేప రెమ్మలు అంటే ఇష్టం.
వేప చెట్ల కిందే ఎక్కువగా అమ్మ వారి ప్రతిమలను ఉంచుతారు. చిన్న చిన్న గుడులు ఉన్నప్పటికీ… వాటిని కూడా చెట్ల కిందనే ఉంచి పండుగలు, పూజలు చేస్తుంటారు.
వేపను అమ్మ వారి ప్రతి రూపంగా భావిస్తారు. వేస్తే వేప కొమ్మ తీస్తే అసిరమ్మ అనే సామేత అలా వచ్చిందే.
అమ్మవారి ప్రతి రూపంగా నిలిపిన వేపను ఆరాధన తర్వాత కదల్చడానికి ప్రజలందరూ భయపడతారు. వేపను అక్కడే ఉంచాలనేది దీని అంతరార్థం.
వేటను అమ్మవారు.వేేపనే అలంకారం
గ్రామ దేవతల పూజల్లో వేప మండలను తోరణాలుగా కడతారు.
అంతేనా బలిచ్చే మేకలకు కూడా వేప రెమ్మలను దండలుగా వేస్తారు.వేసే బోనాలకు పూలతో పాటు వేప రెమ్మలను చుడతారు.
చివరకు శివ సత్తుల చేతుల్లో కూడా వేప రెమ్మలే కనిపిస్తాయి. అమ్మ వారు అంటే వేప. వేప అంటే అమ్మ వారు అనేంతలా వేపను పూజిస్తుంటారు. అంతే కాదండోయ్… చిన్న పిల్లలకు, పెద్దలకు ఎవరికి అమ్మ వారు పోసినా… వేప రెమ్మలు వేసి దానిపై వారిని పడుకోబెడతారు.
వాటిలో ఉన్న ఔషధ గుణాలు గాలిలో వ్యాపించి ఆరోగ్యాన్ని ఇస్తాయనేది ఆంతర్యం.