ఆంధ్రప్రదేశ్( Andhra Pradesh ) రాష్ట్రంలోని తిరుమల పుణ్యక్షేత్రానికి ప్రతిరోజు ఎన్నో వేల మంది భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు.అందుకోసమే తిరుమలలోని రహదారులు ఎప్పుడు రద్దీగా ఉంటాయి.
ఈ రద్దీనీ దూరం చేయడానికి, అలాగే రోడ్డు ప్రమాదాలను నివారించడానికి పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు.తిరుమల ఘాట్ రోడ్లో నిబంధనలు అతిక్రమిస్తే ఆ వాహనాలపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు తిరుమలకు ఆ వాహనాలను నిషేధిస్తామని తిరుమల అడిషనల్ ఎస్పీ ముని రామయ్య( SP Muni Ramaiah ) హెచ్చరించారు.

మంగళవారం తిరుమలలోని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అడిషనల్ ఎస్పీ ముని రామయ్య మీడియాతో మాట్లాడుతూ తిరుమల ఘాట్ రోడ్లో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల నివారణకు టిటిడి( TTD ) చర్యలు మొదలుపెట్టిందని తెలిపారు.తిరుమల ట్రాఫిక్ పోలీసులు, టీటీడీ విజిలెన్స్ అధికారుల నేతృత్వంలో ప్రమాదాల నివారణకు ప్రత్యేక టీం ను ఏర్పాటు చేశామని వెల్లడించారు.తిరుమల ఘాట్ రోడ్ లో డ్రైవింగ్ పై వాహనదారులకు అవగాహన లేకపోవడం, డ్రైవర్ల నిర్లక్ష్యం కారణంగా తరచు రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు.

అలాగే ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం, అతివేగం కారణాల వల్ల రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని తెలిపారు.అంతేకాకుండా సెల్ఫీలు తీసుకోవడం కోసం రోడ్డు పక్కన వాహనాలు ఆపడం వల్ల కూడా రోడ్డు ప్రమాదాలు పెరిగాయని వెల్లడించారు.అవగాహన కలిగిన డ్రైవర్లు మాత్రమే వాహనాలు నడపాలని, డ్రైవర్లకు అవగాహన కల్పించే విధంగా తిరుమల ట్రాఫిక్ పోలీసులు పలు ప్రాంతాలలో సూచనలు సలహాలు ఇచ్చే విధంగా చర్యలు చేపట్టారు.
ఇంకా చెప్పాలంటే ఘాట్ రోడ్ లో స్పీడ్ లిమిట్ ను తిరిగి ప్రారంభిస్తామని ఘాట్ రోడ్ లో పోలీసుల నిబంధనలను అతిక్రమిస్తే ఆ వాహనాలను పూర్తిగా తిరుమలకు రాకుండా నిషేధించే విధంగా చర్యలు తీసుకుంటామని తిరుపతి అడిషనల్ ఎస్పీ ముని రామయ్య హెచ్చరికలు జారీ చేశారు.