రాములోరి శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాలు.. ఎక్కడంటే..?

తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన వైఎస్సార్ జిల్లా ఒంటిమిట్టలోని శ్రీ కోదండ రామస్వామి( Vontimitta Brahmotsavam ) వారి దేవాలయం వార్షిక శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.మార్చి 31 నుంచి ఏప్రిల్ 9వ తేదీ వరకు నిర్వహించనున్న ఉత్సవాలకు గురువారం రాత్రి శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది.

 Vontimitta Brahmotsavam Of Sri Ramanavami , Vontimitta Brahmotsavam  , Ambati Ra-TeluguStop.com

ఇందులో భాగంగా శ్రీ సీతారామ లక్ష్మణ ఉత్సవమూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించి ప్రత్యేక వేదికపై కొలువు తీర్చి విష్వక్సేన పూజా, కలశం,కలశం ప్రతిష్ట, కలశపూజ వాసుదేవ పుణ్యాహవాచనం, కంకణధారణ చేశారు.

ఆ తర్వాత ఆ కంకణ భట్టార్ శ్రీ కెహెచ్.రాజేష్ కుమార్ ఆధ్వర్యంలో పుట్టమన్ను సేకరించారు.శుక్రవారం ధ్వజారోహణం కవి సమ్మేళనం, శేష వాహన సేవ నిర్వహించనున్నారు.

ఈ కార్యక్రమంలో దేవాలయ డిప్యూటీ ఈవో శ్రీ నటేష్ బాబు, సూపరింటెండెంట్లు వెంకటేశయ్య, ఆర్సీ సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.ఇంకా చెప్పాలంటే తిరుమల తిరుపతి దేవస్థానం ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో నిర్వహించిన పోతన భాగవత కవి సమ్మేళనం ఆకట్టుకుంది.

పోతన సాహిత్య పీఠం కార్యదర్శి నారాయణరెడ్డి “రుక్మిణి సందేశం” డాక్టర్ బి.గోపాలకృష్ణశాస్త్రి “శ్రీరామ జననం” డాక్టర్ కే.సుమన “సీతారామ కళ్యాణం” పి.శంకర్ “భక్త రసం” వీ.చిన్నయ్య “కుచేలోపాఖ్యానం” ఎం లోకనాథం ‘శరణాగతితత్వం అనే అంశాలపై ఉపన్యాసించారు.

శ్రీరామనవమి రోజు ఏ రామాలయంలో అయినా రాముని కళ్యాణం జరుగుతుంది.అయితే ఒంటిమిట్టలో మాత్రం చంద్రుడు చూసేలా రాత్రివేళ శ్రీ రాముని కళ్యాణాన్ని ఎంతో ఘనంగా నిర్వహిస్తారు.ఒంటిమిట్ట కోదండరామునికి రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు ( Ambati Rambabu )కుటుంబ సమేతంగా స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.

మంత్రికి దేవాలయ అధికారులు ఘన స్వాగతం పలికారు.ఈ సందర్భంగా ఒంటిమిట్ట ఎంపీపీ గడ్డం జనార్దన్ రెడ్డి మంత్రికి శాలువా కప్పి ఘనంగా సత్కరించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube