నక్సలిజం బ్యాక్ డ్రాప్ సినిమాను తెరకెక్కించడం మామూలు విషయం కాదు.కేవలం కొంతమంది దర్శకులు మాత్రమే ఇలాంటి సినిమాలను తెరకెక్కించడానికి ధైర్యం చేస్తూ ఉంటారు అని చెప్పాలి.
అయితే ఇప్పటి వరకు తెలుగు చిత్ర పరిశ్రమలో నక్సలిజం బ్యాక్ గ్రౌండ్ లో ఎన్నో సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.ఇలా వచ్చిన సినిమాలు కొన్ని సూపర్ డూపర్ హిట్ సాధిస్తే మరికొన్ని సినిమాలు మాత్రం ఫ్లాప్ గానే మిగిలి పోయాయి అని చెప్పాలి.
మరి టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పటి వరకు నక్సలిజం బ్యాక్ డ్రాప్ తో వచ్చి మంచి విజయాన్ని అందుకున్న సినిమాలేవో ఇప్పుడు తెలుసుకుందాం.
అప్పట్లో ఒకడుండేవాడు : నారా రోహిత్, శ్రీ విష్ణు ప్రధాన పాత్రలలో సాగర్ కె.చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన అప్పట్లో ఒకడుండేవాడు సినిమా నక్సలిజం బ్యాక్ డ్రాప్ లోనే వచ్చింది.అయితే ఇక ఈ సినిమాలో ఇద్దరు హీరోలకు కూడా మంచి పేరు వచ్చింది.
ఇక ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్బస్టర్గా కాకపోయినా డీసెంట్ హిట్ గా నిలిచింది అని చెప్పాలి.
సింధూరం : తెలుగు చిత్ర పరిశ్రమలో నక్సలిజం బ్యాక్ డ్రాప్ లో వచ్చిన సినిమాల గురించి మాట్లాడుతూ ఉంటే ముందు వరుసలో వచ్చేది సింధూరం సినిమా గురించే.ఎందుకంటే నక్సలిజం బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ సినిమా ఎంత బ్లాక్ బస్టర్ సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.బ్రహ్మాజీ రవితేజ ప్రధాన పాత్రలో కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది.
గమ్యం : శర్వానంద్, అల్లరి నరేష్ హీరోలుగా నక్సలిజం బ్యాక్ డ్రాప్ లో వచ్చిన గమ్యం సినిమా క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కింది.ఇక ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది అని చెప్పాలి.
రక్త చరిత్ర : రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో వివేక్ ఒబెరాయ్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాలో నక్సలిజం బ్యాక్ డ్రాప్ టచ్ కొంత ఉంటుంది.సినిమా మొదటి పార్ట్ హిట్ అయితే రెండవ పార్ట్ మాత్రం ఫ్లాప్ అయ్యింది.
విరాట పర్వం : వేణు ఊడుగుల దర్శకత్వంలో సాయి పల్లవి రానా జంటగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విరాట పర్వం సినిమా నక్సలిజం బ్యాక్ డ్రాప్ లో నే వచ్చింది అని చెప్పాలి.అయితే ఇక ఈ సినిమా ఇటీవలే విడుదలై మంచి టాక్ ను సొంతం చేసుకుని హిట్టు కొట్టింది.
ఒసేయ్ రాములమ్మ : విజయశాంతి ప్రధానపాత్రలో తెరకెక్కిన ఒసేయ్ రాములమ్మ సినిమా కూడా నక్సలిజం బ్యాక్ డ్రాప్ లోనే ప్రేక్షకుల ముందుకు వచ్చి సెన్సేషనల్ విజయాన్ని సాధించింది.