మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ( Ram Charan ) ప్రస్తుతం బుచ్చిబాబు సానా( Bucchi Babu Sana ) దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం మనకు తెలిసిందే.ఇటీవల శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు అయితే ఈ సినిమా అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.
ఇలా ఈ సినిమా పూర్తి స్థాయిలో ప్రేక్షకులను నిరాశపరచడంతో అభిమానులు తదుపరి సినిమాపై ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు.ప్రస్తుతం రామ్ చరణ్ బుచ్చిబాబు డైరెక్షన్లో చేయబోయే సినిమాకి పెద్ది( Peddi ) అని టైటిల్ ఖరారు చేసిన సంగతి తెలిసిందే.

ఇటీవల రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్ పోస్టర్ తో పాటు రామ్ చరణ్ ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుదల చేశారు.ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరొక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తుంది ఇక ఇందులో రామ్ చరణ్ కి జోడిగా నటి జాన్వీ కపూర్ ( Janhvi Kapoor ) హీరోయిన్గా నటిస్తున్నారు.ఇక ఇటీవల కాలంలో ప్రతి ఒక్క సినిమాలో కూడా స్పెషల్ సాంగ్ ఉండేలా దర్శక నిర్మాతలు చర్యలు తీసుకుంటున్నారు.

ఇలా స్పెషల్ సాంగ్ కోసం భారీ స్థాయిలో బడ్జెట్ కేటాయించి ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు.ఇకపోతే పెద్ది సినిమాలో కూడా ఇలాంటి ఒక స్పెషల్ సాంగ్ డైరెక్టర్ ప్లాన్ చేశారని తెలుస్తోంది.అయితే ఈ పాటలో నటించడం కోసం స్టార్ హీరోయిన్ని రంగంలోకి దింపుతున్నట్టు తెలుస్తోంది.మరిపెద్ది సినిమాలో రామ్ చరణ్ సరసన స్పెషల్ సాంగ్ చేయబోయే ఆ హీరోయిన్ ఎవరనే విషయాన్న వస్తే ఆమె ఎవరో కాదు సమంత( Samantha ) అంటూ వార్తలు హల్చల్ చేస్తున్నాయి.
ఇదివరకే వీరిద్దరి కాంబినేషన్లో రంగస్థలం సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అద్భుతమైన విజయాన్ని అందుకుంది ఇప్పుడు మరోసారి పెద్ది సినిమాలో సమంత స్పెషల్ సాంగ్ చేస్తున్నారంటే ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ అని అభిమానులు భావిస్తున్నారు.అయితే ఇందులో ఎంతవరకు నిజముందనేది తెలియాలి అంటే మేకర్స్ స్పందించాల్సి ఉంది.