పెద్ది స్పెషల్ సాంగ్ కోసం రంగంలోకి దిగుతున్న స్టార్ హీరోయిన్…ఇక బ్లాక్ బస్టరే?
TeluguStop.com
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ( Ram Charan ) ప్రస్తుతం బుచ్చిబాబు సానా( Bucchi Babu Sana ) దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం మనకు తెలిసిందే.
ఇటీవల శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు అయితే ఈ సినిమా అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.
ఇలా ఈ సినిమా పూర్తి స్థాయిలో ప్రేక్షకులను నిరాశపరచడంతో అభిమానులు తదుపరి సినిమాపై ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు.
ప్రస్తుతం రామ్ చరణ్ బుచ్చిబాబు డైరెక్షన్లో చేయబోయే సినిమాకి పెద్ది( Peddi ) అని టైటిల్ ఖరారు చేసిన సంగతి తెలిసిందే.
"""/" /
ఇటీవల రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్ పోస్టర్ తో పాటు రామ్ చరణ్ ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుదల చేశారు.
ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరొక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తుంది ఇక ఇందులో రామ్ చరణ్ కి జోడిగా నటి జాన్వీ కపూర్ ( Janhvi Kapoor ) హీరోయిన్గా నటిస్తున్నారు.
ఇక ఇటీవల కాలంలో ప్రతి ఒక్క సినిమాలో కూడా స్పెషల్ సాంగ్ ఉండేలా దర్శక నిర్మాతలు చర్యలు తీసుకుంటున్నారు.
"""/" /
ఇలా స్పెషల్ సాంగ్ కోసం భారీ స్థాయిలో బడ్జెట్ కేటాయించి ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు.
ఇకపోతే పెద్ది సినిమాలో కూడా ఇలాంటి ఒక స్పెషల్ సాంగ్ డైరెక్టర్ ప్లాన్ చేశారని తెలుస్తోంది.
అయితే ఈ పాటలో నటించడం కోసం స్టార్ హీరోయిన్ని రంగంలోకి దింపుతున్నట్టు తెలుస్తోంది.
మరిపెద్ది సినిమాలో రామ్ చరణ్ సరసన స్పెషల్ సాంగ్ చేయబోయే ఆ హీరోయిన్ ఎవరనే విషయాన్న వస్తే ఆమె ఎవరో కాదు సమంత( Samantha ) అంటూ వార్తలు హల్చల్ చేస్తున్నాయి.
ఇదివరకే వీరిద్దరి కాంబినేషన్లో రంగస్థలం సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అద్భుతమైన విజయాన్ని అందుకుంది ఇప్పుడు మరోసారి పెద్ది సినిమాలో సమంత స్పెషల్ సాంగ్ చేస్తున్నారంటే ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ అని అభిమానులు భావిస్తున్నారు.
అయితే ఇందులో ఎంతవరకు నిజముందనేది తెలియాలి అంటే మేకర్స్ స్పందించాల్సి ఉంది.