పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్( Prabhas ) ప్రస్తుతం వరస సినిమాలకు కమిట్ అవుతూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు.ఇక ప్రభాస్తోపాటు ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన హీరోలు ఈయన తర్వాత ఇండస్ట్రీకి వచ్చిన హీరోలు అందరూ కూడా ఇప్పటికే పెళ్లిళ్లు చేసుకొని పిల్ల పాపలతో సంతోషంగా ఉన్నారు కానీ ప్రభాస్ మాత్రం ఇప్పటికీ పెళ్లి( Marriage ) గురించి ఆలోచించడం లేదు.
ఈ విధంగా ప్రభాస్ వయసు పైబడుతున్న పెళ్లి చేసుకోకపోవడంతో అభిమానులు కూడా ఈయన పెళ్లి చేసుకుంటే బాగుంటుందని భావిస్తున్నారు.

ఇకపోతే ప్రభాస్ పెళ్లి( Prabhas Marriage ) గురించి ఇప్పటికే ఎన్నో రకాల వార్తలు వినిపించాయి ఈయన పలానా హీరోయిన్ తో డేటింగ్ లో ఉన్నారని ఫలానా హీరోయిన్ తో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారంటూ ఎన్నో రకాల వార్తలు వచ్చాయి అయితే ఈ వార్తలను ఎప్పటికప్పుడు ప్రభాస్ టీమ్ ఖండిస్తూ వచ్చారు.ఇకపోతే తాజాగా ప్రభాస్ పెళ్లికి సంబంధించి మరొక వార్త కూడా వినిపిస్తున్న సంగతి తెలిసిందే.ప్రభాస్ కి తన పెద్దమ్మ అదిరిపోయే అమ్మాయిని ఫిక్స్ చేసింది అంటూ వార్తలు వినిపించాయి ప్రభాస్ హైదరాబాద్( Hyderabad ) అల్లుడు కాబోతున్నారని గత రెండు రోజులగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

హైదరాబాద్ కి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త కుమార్తెతో ప్రభాస్ కి శ్యామలాదేవి పెళ్లి ఫిక్స్ చేశారని ఇప్పటికే పెళ్లి పనులు కూడా జరుగుతున్నాయి అంటూ వార్తలు వినిపించాయి.ఇలా ప్రభాస్ పెళ్లి గురించి పెద్ద ఎత్తున వార్తలు వస్తున్న నేపథ్యంలో ప్రభాస్ టీం ఈ వార్తలపై స్పందించారు.ప్రభాస్ పెళ్లి గురించి సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని ఇలాంటి తప్పుడు వార్తలను దయచేసి ప్రచారం చేయొద్దు అంటూ ఈ వార్తలను ఖండించారు.ఇలా పెళ్లి వార్తలలో నిజం లేదని తెలియడంతో అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు.