యవ్వనం ప్రారంభమైన దగ్గర నుంచీ స్టార్ట్ అయ్యే సమస్యల్లో మొటిమలు(పింపుల్స్) ముందు వరసలో ఉంటాయి.హార్మోన్ ఛేంజస్, ఆహారపు అలవాట్లు, పోషకాల కొరత, కాలుష్యం ఇలా కారణం ఏదైనప్పటికీ.
చర్మ సౌందర్యాన్ని పనిగట్టుకుని మరీ పాడుచేయడానికి పింపుల్స్ ఎప్పుడూ సిద్ధగా ఉంటాయి.ముఖ్యంగా కొందరు మొటిమలతో మరింత తీవ్రంగా సతమతం అయిపోతుంటారు.
మొటిమల నుంచి తమను తామ ఎలా రక్షించుకోవాలో తెలీక.ఉన్న వాటిని ఎలా నివారించుకోవాలో అర్థంగాక నిత్యం మదన పడిపోతుంటారు.
అయితే అలాంటి వారికి ఇప్పుడు చెప్పబోయే హోమ్ మేడ్ పింపుల్ క్రీమ్ అద్భుతంగా సహాయపడుతుంది.మరి ఇంకెందుకు ఆలస్యం ఈ క్రీమ్‌ను ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం పదండీ.
ముందుగా చిన్న సైజ్ కీర తీసుకుని నీటిలో శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసుకోవాలి.అలాగే చిన్న అల్లం ముక్కను తీసుకుని పీల్ తొలగించి వాటర్‌లో కడిగి ముక్కలు కట్ చేసుకోవాలి.
మరోవైపు గుప్పెడు నిమ్మపండు తొక్కలను కూడా సేకరించి పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు బ్లండర్ తీసుకుని అందులో కీర ముక్కలు, అల్లం ముక్కలు, నిమ్మపండు తొక్కలు మరియు నాలుగు టేబుల్ స్పూన్ల రోజ్ వాటర్ వేసి మెత్తగా పేస్ట్ చేసుకుని జ్యూస్‌ను వేరు చేసుకోవాలి.ఆ తర్వాత ఒక బౌల్ తీసుకుని అందులో ప్యూర్ అలోవెర జెల్ ఐదు టేబుల్ స్పూన్లు, ముందుగా తయారు చేసి పెట్టుకున్న జ్యూస్ మూడు టేబుల్ స్పూన్లు వేసి బీటర్ సాయంతో కాసేపు మిక్ చేసుకుంటే పింపుల్ క్రీమ్ సిద్ధమైనట్టే.
ఈ క్రీమ్‌ను ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే ఇరవై రోజుల వరకు వాడుకోవచ్చు.
రోజుకు రెండు సార్లు మొటిమలపై ఈ క్రీమ్‌ను అప్లై చేసి.పావు గంట తర్వాత శుభ్రంగా కూల్ వాటర్‌తో క్లీన్ చేసుకోవాలి.
ఇలా చేస్తే పింపుల్స్ త్వరగా తగ్గడమే కాదు.వాటి వల్ల చర్మంపై మచ్చలు కూడా పడకుండా ఉంటాయి.