స్కిన్ ఫుల్ టాన్( Skin Tan ) అయిపోయిందా.? డార్క్ గా, డల్ గా మారిందా.? మళ్లీ చర్మాన్ని అందంగా, కాంతివంతంగా మార్చుకోవాలని భావిస్తున్నారా.? అయితే ఇప్పుడు చెప్పబోయే హోమ్ రెమెడీ మీకు సూపర్ పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది.ఈ రెమెడీతో టాన్ రిమూవ్ అవుతుంది.డల్ నెస్ ఎగిరిపోతుంది.కేవలం ఇరవై నిమిషాల్లోనే గ్లోయింగ్ స్కిన్( Glowing Skin ) మీ సొంతం అవుతుంది.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ హోమ్ రెమెడీ గురించి పూర్తిగా తెలుసుకుందాం పదండి.

ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అర కప్పు వాటర్ పోసుకోవాలి.వాటర్ బాయిల్ అయ్యాక పావు టీ స్పూన్ పసుపు,( Turmeric ) వన్ టీ స్పూన్ షుగర్( Sugar ) వేసి నాలుగు నిమిషాల పాటు మరిగించాలి.ఆపై స్టవ్ ఆఫ్ చేసుకుని వాటర్ ను చల్లారబెట్టుకోవాలి.ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో వన్ టేబుల్ స్పూన్ గోధుమపిండి వేసుకోవాలి.అలాగే వన్ టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్, పావు టీ స్పూన్ బాదం నూనె మరియు సరిపడా టర్మరిక్ షుగర్ వాటర్ ను పోసి బాగా మిక్స్ చేసుకోవాలి.

ఈ మిశ్రమాన్ని ముఖానికి మరియు మెడకు అప్లై చేసుకుని 20 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.ఆపై తడిచేతులతో చర్మాన్ని సున్నితంగా రబ్ చేసుకుంటూ వాటర్ తో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.ఈ సింపుల్ రెమెడీని పాటించడం వల్ల చర్మంపై పేరుకుపోయిన మురికి, మృత కణాలు తొలగిపోతాయి.
టాన్ రిమూవ్ అవుతుంది.చర్మం లోతుగా శుభ్రం అవుతుంది.
మృదువుగా, తాజాగా మారుతుంది.అలాగే ఇప్పుడు చెప్పుకున్న హోమ్ రెమెడీ చర్మానికి కొత్త మెరుపును జోడిస్తుంది.
స్కిన్ సూపర్ గ్లోయింగ్ గా మెరిసేలా ప్రోత్సహిస్తుంది.కాబట్టి ఇన్స్టెంట్ గ్లో ను కావాలనుకునేవారు తప్పకుండా ఇప్పుడు చెప్పుకున్నారు రెమెడీని ప్రయత్నించండి.