బిగ్ బాస్ అంటేనే ప్రేమ కథలు, గొడవలు అనేది అందరికి తెలిసిన విషయమే.ఇంతకు ముందు సీజన్స్ లో కూడా ఒకటి రెండు వారాల్లో గ్రూప్స్ గా చేరడం, లవ్ ట్రాక్స్ నడపడం చేసారు.
ఇక చివరి సీజన్ లో మోనాల్ గజ్జర్ సైతం ఒక వైపు అభిజిత్ తో మరో వైపు అఖిల్ తో ప్రేమాయణం కొనసాగలించి ఆమె ఎవరితో ఉంటుందో ఫిక్స్ అవ్వక, జనాలకు సైతం కన్ఫ్యూజ్ చేసింది.ఇక చివరి వారాలకు వచ్చే సరికి అఖిల్ వైపు మొగ్గు చూపి అభిజిత్ కి దూరం అయ్యింది.
ఏది ఏమైనా మోనాల్ లవ్ ట్రాక్ బిగ్ బాస్ కి మంచి రేటింగ్ ని తెచ్చి పెట్టింది.అందుకే ప్రతి సీజన్ లో లవ్ ట్రాక్ కామన్ అయిపోయిది.
ఇక నిర్వాహకులు కూడా వచ్చిన మొదటి రోజు నుంచి ట్రాక్స్ నడపాలని డిమాండ్ చేస్తున్నట్టు సమాచారం.
ఇక ఈ సీజన్ లో హమీద, మోనాల్ గజ్జర్ లాగ గేమ్ ప్లే చేస్తున్నట్టు స్ప్రష్టంగా అర్ధం అవుతుంది.
ఎందుకంటే హమీద సైతం మల్టీపుల్ ట్రాక్స్ నడిపిస్తుంది.ఆమెను బిగ్ బాస్ యాజమాన్యం అందుకు ఒప్పించిందా అనే అనుమానం కూడా వస్తుంది అభిమానులకు.ఒక వైపు సింగర్ శ్రీరామ చంద్రకు హమీదా దగ్గర అయ్యేందుకు విశ్వప్రయత్నాలు చేస్తుంది.ఇందుకు శ్రీరామ చంద్ర కూడా ఒకే అన్నటుగా సిగ్నల్స్ ఇస్తున్నాడు.

నిన్నటికి నిన్న స్విమ్మింగ్ పూల్ వద్ద ఇద్దరు కూర్చొని రొమాంటిక్ గా మాట్లాడుకోవడం చూసి అంత షాక్ అయ్యారు.హమీద చెప్తున్నా మాటలకూ శ్రీరామ్ చంద్ర సిగ్గు పడుతూ తల ఊపడం బట్టి చూస్తే ఇద్దరికీ ట్రాక్ నడపడం ఇష్టం అన్నట్టుగా ఉంది.మరో వైపు దీప్తి సునయన తో పీకల్లోతు ప్రేమలో ఉన్న షణ్ముఖ్ కూడా హమీద తో ట్రాక్ నడుపుతున్నట్టు స్ప్రష్టం గా కనిపిస్తుంది.షన్ను కి బాగా నచ్చిన పిల్లో లో తన పేరు యాడ్ చేసుకొమ్మనడం అందుకు షన్ను సిగ్గు పడటం బట్టి చూస్తే వీరి ట్రాక్ కూడా కంఫర్మ్ అని తెలుస్తుంది.

హమీద ఈ ఇద్దరి తోనే కాకుండా మిగతా ఇంటి సభ్యుల్లో మొగవాళ్ళతో ఫ్రీ గా ఉండటానికి బాగా ట్రై చేస్తుంది.మరో వైపు హమీద సిగరెట్ స్మోక్ చేస్తున్న వీడియోలు కూడా ప్లే చేయకపోవడం ఆమెను హైలెట్ చేయడం లాగానే అనిపిస్తుంది.మరి ఈ క్యూట్ హమీద లవ్ ట్రాక్స్ నడిపి బిగ్ బాస్ షో రేటింగ్స్ పెంచుతుందా లేదా అనేది మరికొన్ని రోజుల్లో తెలిసే అవకాశం ఉంది.