టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలలో మంచి గుర్తింపును సొంతం చేసుకున్న హీరోయిన్లలో స్నేహ( Heroine Sneha ) ఒకరు.స్నేహ తాజాగా అరుణాచలం( Arunachalam ) వెళ్లి భర్త ప్రసన్న కుమార్( Prasanna Kumar ) తో కలిసి గిరి ప్రదక్షిణ చేశారు.
సూర్యుడు ఉదయించడానికి ముందే సూర్య, ఆమె భర్త ప్రసన్న మాస్కులు ధరించి కాలినడకన గిరి ప్రదక్షిణ చేశారు.దారిలో ఎదురయ్యే ఆలయాల దగ్గర కొబ్బరికాయలు కొడుతూ ఆ తర్వాత ఆమె నడక సాగించారు.
ఈ క్రమంలో ఎదురైన హిజ్రాలతో సైతం ఆమె కలిసి ఫోటో దిగారు.కానీ కొండ కింద స్నేహ, ప్రసన్న ప్రదక్షిణ చేసే సమయంలో చెప్పులు, శాండిల్స్ ధరించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతోంది.ఇది చూసిన నెటిజన్లు స్నేహ దంపతులపై తీవ్రస్థాయిలో ఫైర్ అవుతున్నారు.

చెప్పులు వేసుకుని గిరి ప్రదక్షిణ చేయడం ఏంటని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.స్నేహ చేసింది మహా పాపమని ఆమెకు కొంచెమైనా బుద్ధుందా అంటూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.ప్రియమైన నీకు సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన స్నేహ తన కెరీర్ లో ఎక్కువగా అభినయ ప్రధాన పాత్రల్లోనే నటించారు.బాలయ్య, వెంకటేశ్, నాగార్జునలకు జోడీగా ఆమె నటించి సక్సెస్ లను అందుకున్నారు.

తన సినీ కెరీర్ లో ఆమె ఎక్కువగా వివాదాలకు దూరంగా ఉంటూనే వార్తల్లో నిలిచారు.తాజాగా విడుదలైన డ్రాగన్ సినిమాలో స్నేహ గెస్ట్ రోల్ లో నటిస్తున్నారు.స్నేహ దంపతులకు ఒక కొడుకు, ఒక కూతురు ఉన్నారు.తనపై వస్తున్న విమర్శల గురించి స్నేహ ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాల్సి ఉంది.స్నేహ తెలుగు సినిమాల్లో సైతం ఎక్కువ సంఖ్యలో సినిమాల్లో నటించాలని ఫ్యాన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తుండగా ఆ కామెంట్లు సైతం నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.