చూస్తుండగానే చలి కాలం వచ్చేసింది.వయసులో సంబంధం లేకుండా అందరిపై చలి పులి పంజా విసురుతోంది.ముఖ్యంగా రాత్రి సమయంలో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోవడంతో.ప్రజలు వణికిపోతున్నారు.ఇక ఈ వింటర్ సీజన్‌లో దగ్గు, జలుబు సమస్యలు ఎక్కువగా ఇబ్బంది పెడుతుంటాయి.వాతావరణం మార్పుల కారణంగా ఈ సమస్యలు వేంటాడుతూ వేధిస్తుంటాయి.
అయితే దగ్గు, జలుబు సమస్యలను తగ్గించడంలో తాటి బెల్లం అద్భుతంగా సహాయపడుతుంది.

మామూలు బెల్లంతో పోలిస్తే.తాటి బెల్లం ఆరోగ్యానికి మరింత మేలు చేస్తుంది.తాటి చెట్టు నుంచి నేరుగా తయారు చేసే ఈ తాటి బెల్లంలో బోలెడన్ని పోషకాలు నిండి ఉన్నాయి.
పూర్వ కాలం నుంచి తాటి బెల్లంను ఉపయోగిస్తున్నారు.అనేక జబ్బులను నివారించడంలోనూ.
మంచి ఆరోగ్యాన్ని అందించడంలోనూ తాటి బెల్లం గ్రేట్‌గా ఉపయోగపడుతుంది.ముఖ్యంగా దగ్గు, జలుబు సమస్యలతో బాధ పడుతున్న వారు తాటి బెల్లంలో ప్రతి రోజు తక్కవ మోతాదులో తీసుకోవాలి.

అలా తీసుకోవడం వల్ల తాటి బెల్లంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు జలుబు, దగ్గు సమస్యల నుంచి ఉపశమనాన్ని కలిగిస్తుంది.శ్వాసనాళ సంబంధిత వ్యాధులను కూడా తాటి బెల్లం దూరం చేస్తుంది.అలాగే భోజనం తర్వాత చిన్న తాటి బెల్లం ముక్క తీసుకుంటే.ఆహారం త్వరగా జీర్ణం అవ్వడంతో పాటు మలబద్ధకం, గ్యాస్ వంటి సమస్యలను దారి చేరకుండా చేస్తుంది.
తాటి బెల్లంలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది.కాబట్టి, రెగ్యులర్‌గా తాటి బెల్లంలో తగిన మోతాదులో తీసుకుంటే రక్త హీనత సమస్యకు దూరంగా ఉందొచ్చు.

అలాగే ప్రతి రోజు గోరు వెచ్చని పాలలో చిన్న తాటి బెల్లం ముక్క కలిపి తీసుకోవడం వల్ల ఒత్తిడి, మానిసక ఆందోళన , తలనొప్పి వంటి సమస్యల నుంచి తక్షణ ఉపశమనం లభిస్తుంది.తాటి బెల్లంలో కాల్షియం కూడా సమృద్ధిగా ఉంటుంది.కాబట్టి, ప్రతి రోజు మోతాదు మించకుండా తాటి బెల్లం తీసుకుంటే ఎముకలు, దంతాలు దృఢంగా మారతాయి.ఇక మధుమేహం ఉన్నవారు పంచదార, మామూలు బెల్లం కంటే తాటి బెల్లం వాడడం ఎంతో ఉత్తమం.