బతుకమ్మ పండుగ గురించి తెలుగు ప్రజలకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.అయితే తొమ్మిది రోజుల పాటు బతుకమ్మలు పేర్చుడం, వాటి చుట్టూ చేరి ఆటలు ఆడటం ఆపై వాటిని నిమజ్జనం చేయడం చేస్తుంటాం.
అయితే బతుకమ్మలను ఎందుకు నిమజ్జనం చేస్తారనే విషయం మాత్రం చాలా మందికి తెలియదు.అయితే బుతుకమ్మను నిమజ్జనం ఎందుకు చేస్తారు, దాని వెనుక ఉన్న ఆంతర్యం ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
బతుకమ్మ పేర్చేందుకు ఉపయోగించే పూలలో ఔషధ గుణాలు ఇమిడి ఉంటాయి.తొమ్మిది రోజుల పాటు తొమ్మిది రకాల పూలను సేకరించి.అందంగా పేర్చుతారు.మొదటి రోజు ఎంగిలి పూల బతుకమ్మ, రెండో రోజు అటుకుల బతుకమ్మ, మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మ, నాలుగో రోజు నాన బియ్యం బతుకమ్మ, ఐదో రోజు అట్ల బతుకమ్మ, ఆరో రోజు అలిగి బతుకమ్మ, ఏడో రోడు వేపకాయల బతుకమ్మ, ఎనిమిదో రోజు వెన్నెముద్దల బతుకమ్మ, తొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మగా కొలుస్తారు.
సద్దుల బతుకమ్మ రోజు పూజ, ఆటపాటల అనంతరం బతుకమ్మను నిమజ్జనం చేస్తారు.ఈ పూలను నీటిలో నిమజ్జనం చేయడం వల్ల నీటిలో ఉండే ఔషధ గుణాల వల్ల నీరు శుద్ధి అవుతుంది.
అందుకే నిమజ్జనం చేస్తుంటారు.తంగేడు పువ్వుల్లో సూక్ష్మక్రిములను చంపే గుణం, గునుగు పువ్వుల్లో జీర్మకోశాన్ని శుద్ధి చేసే గుణం, సీత జడ పూలైతే జలుబు, ఆస్తమాను దూరం చేసే గుణం, మందార పువ్వు అయితే చుండ్రు నిరోధించడం, కట్ల పువ్వులో ఆజీర్తికి, గుమ్మడి పువ్వుల్లో విటామిన్ ఏ పుష్కలంగా ఉంటాయి.
వీటి వల్ల చెరువుల్లో ఉండే నీరు శుద్ధి అయి నీటిలో ఆక్సిజన్ శాతం పెరుగుతుంది.
LATEST NEWS - TELUGU