సాధారణంగా మన ఆచార వ్యవహారాలతో పాటు వాస్తు శాస్త్రాన్ని కూడా మనం ఎంతో నమ్ముతాము.ఈ క్రమంలోనే మన ఇంట్లో ప్రతి ఒక్క చిన్న వస్తువులను కూడా వాస్తు శాస్త్రం ప్రకారం అలంకరించుకుంటారు.
అయితే వాస్తు సరిగా లేకపోతే ఇంట్లో ఉన్నటువంటి వారు ఎన్నో ఆర్థిక ఇబ్బందులను, అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు.ఈ విధమైనటువంటి ఆర్థిక సమస్యలతో సతమతమయ్యేవారు మన ఇంట్లో కొన్ని వాస్తు పరిహారాలను పాటించడంవల్ల ఈ విధమైనటువంటి సమస్యల నుంచి పూర్తిగా విముక్తి పొందవచ్చు.
వాస్తు శాస్త్రం ప్రకారం మన ఇంట్లో ఎలాంటి సమస్యలు లేకుండా సుఖసంతోషాలు వెల్లివిరియాలంటే ఇంటి ప్రధాన ద్వారం వద్ద కుంకుమతో స్వస్తిక్ అనే చిత్రాన్ని గీసి ఉండాలి.స్వస్తిక్ చిహ్నం శుభానికి సంకేతం కనుక ఇది ఏ విధమైనటువంటి నెగిటివ్ ఎనర్జీ మన ఇంటిలోకి రాకుండా కాపాడుతుంది.
అలాగే మన ఇంట్లో ఒక ఎరుపు రంగు వస్త్రంలో శంఖం లేదా గవ్వలను ఎర్రటి వస్త్రంలో కట్టి ఆ వస్త్రాన్ని ఇంటి ప్రధాన ద్వారానికి కట్టాలి.అదేవిధంగా మన ఇంట్లో ఏర్పడిన వాస్తుదోషాలు తగ్గాలంటే మన ఇంటి ప్రధాన ద్వారానికి ఎదురుగా తులసి మొక్కను నాటాలి.

చాలామంది ఇంట్లో కొద్దిగా పగిలి పోయినా కూడా ఆ వస్తువులను అలాగే ఉంచుకుంటారు.ఇలా పగిలిపోయిన వస్తువులను ఇంటిలో పెట్టుకోవడం వల్ల వాస్తు దోషాలను ఎదుర్కోవలసి వస్తుంది.అదేవిధంగా రాత్రి సమయంలో ఉప్పు డబ్బా ఇంటి మూలాన పెట్టడం వల్ల ఇంట్లో ఏర్పడిన నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి ఇల్లు మొత్తం అనుకూల వాతావరణ పరిస్థితులు ఏర్పడతాయి.ఈ విధమైనటువంటి పరిహారాలు పాటించడం వల్ల ఇంట్లో ఏర్పడిన ఆర్థిక ఇబ్బందులు మాత్రమే కాకుండా, అనారోగ్య సమస్యలు మానసిక ఒత్తిడి కూడా తొలగిపోతుందని వాస్తుశాస్త్ర నిపుణులు తెలియజేస్తున్నారు.