ఆ పాత ఇంటిని భారీ రేటుకు అమ్మేసిన అమితాబ్.. ఎన్ని కోట్లంటే?

బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కు ప్రేక్షకుల్లో ఉండే ఫ్యాన్ ఫాలోయింగ్ అంతాఇంతా కాదు.తెలుగు రాష్ట్రాల్లో అమితాబ్ నటించిన సినిమాలు ఎక్కువగా ఆడకపోయినా ఆయనకు ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం భారీస్థాయిలో ఉంది.

 Bollywood Megastar Amitabh Sold His Parents Old Bungalow Details, Amitab Bachcha-TeluguStop.com

అమితాబ్ బచ్చన్ కౌన్ బనేగా కరోడ్ పతి ప్రోగ్రామ్ కు హోస్ట్ గా వ్యవహరించడంతో పాటు పలు బాలీవుడ్ సినిమాలలో నటిస్తున్నారు.ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న ప్రాజెక్ట్ కె సినిమాలో కూడా అమితాబ్ కీలక పాత్రలో నటిస్తున్నారు.

తాజాగా అమితాబ్ బచ్చన్ పాత ఇంటిని అమ్మడం ద్వారా వార్తల్లో నిలిచారు.అమితాబ్ ఈ ఇంటిని ఏకంగా 23 కోట్ల రూపాయలకు అమ్మారని బోగట్టా.ఈ భవనాన్ని 1980 సంవత్సరానికి ముందు కట్టారని సమాచారం.ప్రస్తుతం ఈ భవనం కూలిపోయే దశలో ఉందని తెలుస్తోంది.

అలాంటి ఇంటికి ఈ స్థాయి రేటు దక్కడం ఒక విధంగా రికార్డు అని కామెంట్లు వినిపిస్తున్నాయి.ఈ భవనం సౌత్ ఢిల్లీలో ఉండగా ఈ భవనం పేరు సోపాన్ కావడం గమనార్హం.

ఈ భవనం అమితాబ్ తల్లి పేరుపై రిజిష్టర్ అయ్యి ఉందని తెలుస్తోంది.

రెండంతస్తుల్లో ఉండే ఈ భవనంలో అమితాబ్ తన తల్లిదండ్రులతో కలిసి చాలా సంవత్సరాల క్రితం ఉండేవారు.కొన్నేళ్ల నుంచి ఈ భవనంలో ఎవరూ నివాసం ఉండటం లేదని తెలుస్తోంది.ప్రస్తుతం అమితాబ్ ముంబైలో కుటుంబంతో కలిసి ఉన్న సంగతి తెలిసిందే.

ఈ భవనం 418 స్వ్కేర్ ఫీట్లు ఉంటుందని బోగట్టా.

అవ్నీ బదేర్ అనే వ్యక్తి ఈ భవనంను కొనుగోలు చేశారు.అవ్నీ ఈ భవనం కొనుగోలు గురించి మాట్లాడుతూ చాలా సంవత్సరాల నుంచి మంచి భవనాన్ని కొనుగోలు చేయాలని చూస్తున్నామని పాత భవనాన్ని పడగొట్టి అభిరుచికి అనుగుణంగా కొత్త భవనాన్ని నిర్మించుకుంటామని ఆయన వెల్లడించారు.

Bollywood Megastar Amitabh Sold His Parents Old Bungalow Details, Amitab Bachchan, Sold Old House, Amitab Bachchan Old Home, 23 Crore Rupees, South Delhi, Kbc, Prabhs, Project K - Telugu Crore Rupees, Amitab Bachchan, Amitabh, Bungalow, Prabhs, Project, Sold, Delhi

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube