దేశంలో వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ( BJP ) మూడోసారి ఎలాగైనా అధికారం కైవసం చేసుకోవడానికి రకరకాల వ్యూహాలతో ముందుకు వెళ్తున్నారు.
ఈ క్రమంలో ప్రతిపక్షాలు బీజేపీ పార్టీని ఎలాగైనా గద్దె దించాలని కూటమిలుగా ఏర్పడుతున్నారు.ఇప్పటికే ఇండియా( INDIA ) అనే కూటమి ఏర్పడడం జరిగింది.
ఈ ఇండియా కూటమిలో దేశంలో పేరుగాంచిన జాతీయ పార్టీలు ఉన్నాయి.పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ( Mamata Banerjee ) సైతం ఈ ఇండియా కూటమిలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు.
పరిస్థితి ఇలా ఉంటే దేశంలో త్వరలో జరగబోయే ఎన్నికలకు సంబంధించి మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు.ఈవీఎంలను( EVM ) హ్యాక్ చేయటానికి బీజేపీ ప్రయత్నిస్తుందని అందుకు సంబంధించిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని అన్నారు.
ప్రస్తుతం దేశంలో విపత్తులు మరియు మతపరమైన ఉద్రిక్తతలు నుంచి ఇండియా కూటమి మాత్రమే దేశాన్ని బయటపడేస్తుందని స్పష్టం చేశారు.ఇదే సమయంలో రాబోయే లోక్ సభ ఎన్నికలలో.
గెలుపు పై కూడా మమతా బెనర్జీ ధీమా వ్యక్తం చేయడం జరిగింది.