శ్రీలీల వల్లే ధమాకా సినిమా హిట్టైందా.. ఈ ప్రశ్నలకు జవాబు దొరికేసిందిగా!

మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన చిత్రం ధమాకా(dhamaka).ఇందులో శ్రీ లీలా(Sreeleela) హీరోయిన్గా నటించిన విషయం తెలిసిందే.

 Did Dhamaka Become A Hit Because Of Sreeleela, Dhamaka, Sreeleela, Tollywood, Ra-TeluguStop.com

భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా రవితేజ కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ సినిమాగా నిలిచింది.మొదట మిక్స్డ్ టాక్ ని యావరేజ్ వ్యూస్ తో మొదలైన ఈ సినిమా ఎవరు ఊహించిన విధంగా దాదాపుగా 100 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి సరికొత్త రికార్డును సృష్టించింది.

ముఖ్యంగా ఈ సినిమా భారీ వసూళ్లను రాబట్టి అందరిని ఆశ్చర్యపరిచింది.అయితే టాక్, రివ్యూలు గొప్పగా లేకపోయినా తట్టుకుని ఈ సినిమా అంత పెద్ద విజయం సాధించడానికి ఇందులోని పాటలు, శ్రీలీల(Sreeleela) గ్లామర్ డ్యాన్సులు ముఖ్య కారణం అనే చర్చ అప్పట్లో జరిగింది.

Telugu Bezawada, Dhamaka, Prasanna Kumar, Raviteja, Sreeleela, Tollywood-Movie

ఇదే మాట ఆ సినిమా రైటర్ ప్రసన్న కుమార్ బెజవాడ(Prasanna Kumar, Bezawada )దగ్గర ప్రస్తావిస్తే అతను ఆశ్చర్యం వ్యక్తం చేశాడు.కేవలం హీరోయిన్ గ్లామర్, డ్యాన్సుల వల్ల సినిమా ఆడేస్తుందా అని అతను ప్రశ్నించాడు.అయితే శ్రీలీల ధమాకా తర్వాత కూడా చాలా సినిమాలు చేసింది కదా,వాటిలోనూ అందంగా కనిపించింది, అదిరిపోయే డ్యాన్సులూ వేసింది మరి అవన్నీ హిట్ అయ్యాయా అని అతను ప్రశ్నించాడు.ఏ సినిమా అయినా బాగా ఆడిందీ అంటే అందుకు ప్రధాన కారణం కథే అని ప్రసన్న కుమార్ అభిప్రాయపడ్డాడు.

ఒక సినిమాలో పాటు మహా అయితే 20 నిమిషాలు ఉంటాయి.

Telugu Bezawada, Dhamaka, Prasanna Kumar, Raviteja, Sreeleela, Tollywood-Movie

ఆ 20 నిమిషాలు ప్రేక్షకులకు మంచి ఫీలింగ్ వస్తే సినిమా ఆడేస్తుందా అని అతను ప్రశ్నించాడు.మిగతా రెండు గంటల పాటు కథను ఆసక్తికరంగా నడిపిస్తేనే ప్రేక్షకులు ఎంగేజ్ అవుతారని అతనని అన్నారు.కథ బాగుండి అది సినిమాను డ్రైవ్ చేస్తే.

హీరోయిన్ గ్లామర్, డ్యాన్సులు లాంటివి బోనస్ అవుతాయని సినిమా ఇంకా పెద్ద స్థాయికి వెళ్లడానికి తోడ్పడతాయని ప్రసన్న అభిప్రాయపడ్డాడు.అంతే తప్ప హీరోయిన్ గ్లామర్, డ్యాన్సులతో ఏ సినిమా ఆడదంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

ధమాకా సినిమాలో ఎంటర్టైన్మెంట్ బాగా కుదిరింది అని అన్నారు.ఈ చిత్రంలో ముందు హైపర్ ఆది పాత్రే లేదని కానీ తన కామెడీ టైమింగ్ నచ్చి రవితేజ తన మీద కొన్ని సీన్లు రాయమంటే అలా తన పాత్రను యాడ్ చేశామని అది బాగా వర్కవుట్ అయిందని ప్రసన్నకుమార్ తెలిపారు.

ఈ సందర్భంగా ప్రసన్నకుమార్ చేసిన వాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube