ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):
సూర్యోదయం: ఉదయం 06.03
సూర్యాస్తమయం: సాయంత్రం 05.39
రాహుకాలం: మ.12.01 నుంచి 01.28 వరకు
అమృత ఘడియలు: ఉ.09.10 నుంచి 09.40 వరకు
దుర్ముహూర్తం: ఉ.11.28 నుంచి 12.14 వరకు
ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):
మేషం:

ఈ రోజు ఈ రాశి వారు కుటుంబంతో సమయం గడపడానికి సమయం దొరుకుతుంది.బిజీ లైఫ్ నుంచి ఈ రోజు కాస్త ఉపశమనం దొరుకుతుంది.పెద్దల మాటకు గౌరవం ఇవ్వడం మూలంగా మీకు మంచి జరిగే అవకాశాలున్నాయి.
కాని వారి మాటలను పెడచెవిన పెడితే మాత్రం భవిష్యత్తులో సమస్యలను ఎదుర్కోకతప్పదు.మీ శత్రువులతో వివాదానికి దారి తీసే అవకాశముంది.వీలైనంత వరకు దూరంగా ఉండటం మంచిది.
వృషభం:

ఈ రోజు ఈ రాశి వారు శుభవార్తలు వింటారు.సంతానం విషయంలో శుభవార్తను వింటారు.దీంతో మీకు ఆర్ధికంగా కూడా కలిసి వస్తుంది.
మీ సంతానం మీ పొజీషన్ ను చూసి గర్వపడేలా చేస్తారు.కాలాన్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారా మీరు కలలు కన్న ప్రపంచం మీ వద్దకు చేరుతుంది.
కుటుంబంతో సమయం గడిపేలా చేసుకోవడం మంచిది.సహోద్యోగుల నుంచి ప్రశంసలు అందుకుంటారు.
మిథునం:

ఈ రోజు ఈ రాశి వారు అనవసర ఖర్చులు చేసే అవకాశముంది.కొన్ని కారణాల మూలంగా బంధువులతో గొడవలకు దిగుతారు.ఇతరుల సలహాలు వినడం మంచిది.మీ వైవాహిక జీవితంలో ఇబ్బందులను ఎదుర్కొంటారు.ఇప్పటి వరకు మీరు చేసిన పొరపాట్లను తెలుసుకుని పాశ్చాతాపం పొందుతారు.
కర్కాటకం:

ఈ రోజు మీకు పరిస్థితులన్నీ అనుకూలంగా ఉంటాయి.మీ స్నేహితుల నుంచి ఆర్థిక సహాయం పొందే అవకాశాలున్నాయి.ఈ రోజు మీ ఆర్థిక పరిస్థితి అంత బాగా లేకపోవచ్చు.
కాని ఇంట్లో ఉన్న మీ అనుబంధం వలన మీరు సంతోషంగా ఉంటారు.సమాజంలో మీరు చేసే సహాయం మీకు గౌరవాన్ని తెచ్చిపెడుతుంది.మీ జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు.
సింహం:

ఈ రోజు ఆ రాశి వారు మంచి ఫలితాలను అందుకుంటారు.అకస్మాత్తుగా బంధువులు వచ్చే అవకాశముంది.దాంతో మీరు అనవసర ఖర్చులు చేయవలసి వస్తుంది.
మీ బంధువుల రాకతో మీకు ప్రయోజనం కలుగుతుంది.రోజు గడిచే కొద్ది మంచి ఫలితాలను పొందుతారు.
మీ సమయాన్ని మీ కిష్టమైన వారికోసం కేటాయిస్తారు.మీ జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు.అనవసర విషయాల్లో తల దూరుస్తారు.
కన్య:

అనవసర విషయాల్లో తల దూరుస్తూ మీ సమయాన్ని వృధా చేసుకుంటారు.అనవసర జోలికి పోకుండా ఉండటం మంచిది.అందరితోనూ వాదిస్తూ రోజంతా గడుపుతారు.
దీంతో మీకు లేనిపోని సమస్యలు వచ్చే అవకాశం ఉంది.కాని వీటన్నింటినీ పట్టంచుకునే స్థితిలో మీరుండరు.
దాంతో మీరు చాలా నష్టపోయే ప్రమాదం పొంచివుంది.వైవాహిక జీవితంతో సంతోషంగా ఉంటారు.ఈ రోజు ఎవ్వరికీ అప్పులివ్వకుండా ఉండటం మంచిది.
తులా:

ఈరాశి వారికి ఈ రోజు అనారోగ్య సమస్యలు రావొచ్చు.విశ్రాంతి తీసుకుంటే మంచిది.ఆర్థిక సమస్యల మూలంగా మీ ఆరోగ్యం మరింత క్షీణించే అవకాశం కూడా ఉంది.
కుటుంబంతో గడపడం వలన కాస్త మనశ్శాంతిగా ఉంటుంది.మీకిష్టమైన ఆలోచనతో రోజంతా గడుపుతారు.అనవసరమైన వివాదాలకు వెళ్లి సమయాన్ని వృధాచేస్తారు.
వృశ్చికం:

ఇచ్చిన అప్పులను తిరిగి పొందుతారు.దీంతో మీరు ఆర్థికంగా లాభాలను అందుకుంటారు.కుటుంబంతో సంతోషంగా సమయాన్ని గడుపుతారు.
పాత రోజుల్లో మీరు చేసిన అల్లరిని గుర్తుచేసుకుని సంతోషంగా ఉంటారు.మీ వైవాహిక జీవితంతో మీకు సమస్యలు రావచ్చు.విజయం పొందాలంటే ముందు దాని కోసం ప్రయత్నం చేయడం మంచిది.
ధనస్సు:

మీ స్నేహితులతో సరదాగా సమయాన్ని గడుపుతారు.అలాగే ఆర్థికంగా దృఢంగా ఉంటారు.అప్పు ఇచ్చిఉంటు మీరు ఉంటే వారి నుంచి మీకు రావల్సినది పొందుతారు.
ఈ రోజు మీ పనులతో చాలా బిజీగా గడుపుతారు.భవిష్యత్ గురించి ప్రణాళికలు వేసుకుంటారు.మీ పనితనం మూలంగా ఇతరుల నుంచి ప్రశంసలు అందుకుంటారు.
మకరం:

ఈ రోజంతా ఈ రాశి వారు ఆనందంగా సమయాన్ని గడుపుతారు.వ్యాపార రంగంలో విజయం సాధిస్తారు.భవిష్యత్ గురించి ప్రణాళికలు వేసుకునే ముందు జాగ్రత్తలు వహించండి.
ఖాళీ సమయం దొరికితే చాలు స్నేహితులతో సమయాన్ని గడపడానికి ఇష్టపడతారు.వైవాహిక జీవితంలో సమస్యలు రావొచ్చు.మీరు తలచుకుంటే అందరితోనూ స్నేహంగా మెలగగలుగుతారు.
కుంభం:

ఈరోజు ఈ రాశి వారికి ఆర్థిక సమస్యలు ఎదుర్కోవచ్చును.అప్పుల వారు మిమ్మల్ని వేధించే అవశాముంది.కుటుంబంలోనూ సమస్యలు ఎదుర్కోవచ్చు.
అనుకూలమైన సమయం కోసం ఎదురు చూడటం మంచిది.సమయాన్ని వృధా చేయకుండా కష్టపడటం మంచిది.కొన్ని సమస్యల మూలంగా ఒత్తిడికి గురవుతారు.
మీనం:

కుటుంబంతో మీరు గడపడం వల్ల సంతోషంగా గడుపుతారు.స్నేహితులతో రోజంతా గడుపుతూ సంతోషంగా ఉంటారు.భవిష్యత్ ప్రణాళికలు వేసుకునేటప్పుడు ఇతరుల సలహాలు తీసుకోవడం మంచిది.
మీ పిల్లల సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నిస్తారు.మీ లోని మంచి గుణాలే మీ జీవిత భాగస్వామితో సంతోషంగా గడపడానికి కారణాలవుతాయి.
ఎక్కువగా ఈ రోజు మీరు దేవాలయాల్లో సమయాన్ని గడుపుతారు.