ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు( AP Politics ) రోజురోజుకీ మారిపోతున్నాయి.ఎన్నికలకు ఇంకా రెండు నెలలు మాత్రమే సమయం ఉంది.
ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీ వచ్చే ఎన్నికలలో ఒంటరిగా పోటీ చేస్తూ ఉంది.తెలుగుదేశం జనసేన పార్టీలు కూటమి( TDP Janasena )గా ఏర్పడటం తెలిసిందే.
ఇప్పుడు ఈ కూటమిలోకి బీజేపీ జాయిన్ కాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.మొదటినుండి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా చంద్రబాబు పవన్ జాగ్రత్త పడుతున్నారు.
ఈ క్రమంలో 2014 ఎన్నికల మాదిరిగా గెలవాలని వ్యూహాలు వేస్తున్నారు.ఆ దిశగానే ఇప్పుడు బీజేపీ.
చంద్రబాబుతో కలిసినట్లు వార్తలు వస్తున్నాయి.
ఈ క్రమంలో వైసీపీ మంత్రి అంబటి రాంబాబు( YCP Minister Ambati Rambabu ) సంచలన వ్యాఖ్యలు చేశారు.మొదటి నుంచి ఆ మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తాయని చెబుతూనే ఉన్నాం.సో ఇప్పుడు టీడీపీ.
బీజేపీ కలయిక మాకు ఆశ్చర్యం అనిపించడం లేదు.టీడీపీ-బీజేపీ-జనసేన( TDP BJP Janasena ) ఫెయిల్యూర్ కాంబినేషన్ అని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఆ కూటమిని ప్రజలు తిరస్కరించడం జరిగింది.మాకు 50 శాతానికి పైగా ఓటు బ్యాంకు ఉంది.
ఎంతమంది కలిసి వచ్చిన విజయం మాదే అని మంత్రి అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది.ప్రస్తుతం చంద్రబాబు( Chandrababu Naidu ) ఢిల్లీ పర్యటనలో ఉన్నారు.
ఈ క్రమంలో ఢిల్లీ బీజేపీ పెద్దలతో కలిసినట్లు పొత్తు కన్ఫర్మ్ అయినట్లు వార్తలు వస్తున్నాయి.