ఇటీవల యూకేలోని( UK ) ఓ ప్రాంతంలో కారులో శవమై తేలిన భారత సంతతి వివాహిత హత్య కేసుకు సంబంధించి పోలీసుల దర్యాప్తులో ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.మృతురాలు హర్షిత బ్రెల్లా మరణంపై అన్ని వేళ్లూ ఆమె భర్త పంకజ్ లాంబా వైపే చూపిస్తున్నాయని నార్తాంప్టన్‌షైర్ పోలీసులు( Northamptonshire Police ) అంటున్నారు.
హర్షిత సోదరి సోనియా మాట్లాడుతూ.పెళ్లి సమయంలో పెద్ద మొత్తంలో బంగారం, డబ్బు ఇచ్చినప్పటికీ లంబా కుటుంబం తమ నుంచి కట్నం డిమాండ్ చేసిందని తెలిపారు.
కట్నం కోసమే పంకజ్ తన సోదరిని హత్య చేసి ఉంటాడని ఆమె అనుమానం వ్యక్తం చేశారు.ఈ ఏడాది మార్చి 22న పంకజ్ – హర్షితల వివాహం జరిగిందని.
పెళ్లయిన నాటి నుంచి అతను కట్నం కోసం వేధిస్తూనే ఉన్నాడని సోనియా ఆరోపించారు.
బ్రెల్లాను( Brella ) హత్య చేసిన అనంతరం ఆమె మృతదేహాన్ని కారులో కార్బీ నుంచి తూర్పు లండన్‌కు తరలించి ఇల్‌ఫోర్డ్‌లోని బ్రిస్బేన్ రోడ్‌లో పార్క్( Park on Brisbane Road, Ilford ) చేసి ఉంచారు.నవంబర్ 10న హర్షిత హత్యకు గురై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తూ పంకజ్ కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.హర్షిత హత్యకు గురైనట్లుగా స్థానిక పోలీస్ స్టేషన్ నుంచి మాకు కాల్ వచ్చినట్లు సోనియా( Sonia ) తెలిపారు.
ఈ వార్త వినగానే తాము షాక్ అయ్యామని.హర్షిత, లంబాకు ఫోన్ చేయగా ఇద్దరి ఫోన్లు స్విచ్ఛాఫ్ వచ్చాయని చెప్పారు.పంకజ్ కుటుంబానికి ఈ విషయం చెప్పగా.వారిలో ఎలాంటి బాధ, ఆందోళన కనిపించలేదని సోనియా ఆరోపించారు.
చనిపోవడానికి ముందు 10వ తేదీన హర్షితతో తాము మాట్లాడామని, ఆ సమయంలో ఆమె చాలా సంతోషంగానే ఉందని.భర్తతో గొడవలు జరిగినట్లుగా చెప్పలేదని ఆమె వెల్లడించారు.
ఆగస్ట్ 29న పంకజ్ ఆమెను కొట్టడంతో హరిత పోలీసులకు ఫిర్యాదు చేసిందని .దీంతో అతని కుటుంబ సభ్యులు మా ఇంటికి వచ్చి మళ్లీ కట్నం డిమాండ్ చేశారని సోనియా తెలిపారు.దీంతో మా నాన్న గారు ఆస్తిలో కొంత భాగాన్ని విక్రయించాలని నిర్ణయించారని.డబ్బు చేతికి రాగానే కట్నం ఇద్దామని అనుకుంటుండగా ఈ దారుణం జరిగిందని సోనియా కన్నీటి పర్యంతమయ్యారు.
కాగా.నవంబర్ 14న హర్షిత మృతదేహం లభ్యమైన తర్వాత నార్తాంప్టన్‌షైర్ పోలీసులు హత్య కేసుగా నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.