ముల్తానీ మట్టితో అందాన్ని మరింత రెట్టింపు చేసుకోండిలా!

అందంగా ఆకర్షణీయంగా కనిపించాలని దాదాపు అందరూ కోరుకుంటారు.కానీ వాతావరణంలో వచ్చే మార్పులు, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, రసాయనాలతో కూడిన చర్మ ఉత్పత్తులను వాడటం తదితర కారణాల వల్ల ఏదో ఒక చర్మ సమస్య ఇబ్బంది పెడుతూనే ఉంటుంది.

 Try These Multani Mitti Masks For Beautiful And Glowing Skin! Glowing Skin, Beau-TeluguStop.com

చర్మం యొక్క మెరుపును మాయం చేస్తుంది.అలా అని అధైర్య పడాల్సిన అవసరం లేదు.

వివిధ చర్మ సమస్యలను దూరం చేయడానికి అందాన్ని మరింత రెట్టింపు చేయడానికి ముల్తానీ మట్టి చాలా అద్భుతంగా తోడ్పడుతుంది. ముల్తానీ మట్టిని ( Multani soil )ఫుల్లర్స్ ఎర్త్ అని కూడా పిలుస్తారు.

ఇది చాలా ప్రయోజనాలను అందిస్తుంది.ఆ ప్రయోజనాలు ఏంటి.? ముల్తానీ మట్టిని చర్మానికి ఎలా ఉపయోగించాలి.? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.

Telugu Beautiful Skin, Tips, Latest, Multanimitti, Skin Care, Skin Care Tips-Tel

ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు ముల్తానీ మట్టి వేసుకోవాలి.అలాగే వన్ టీ స్పూన్ విటమిన్ ఈ ఆయిల్( Vitamin E oil ) మరియు మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ ఫ్రెష్ బొప్పాయి పండు ప్యూరీ( Fresh papaya fruit puree ) వేసుకుని మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్రమాన్ని ముఖానికి మెడకు అప్లై చేసుకుని 20 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.ఆపై వాటర్ తో క్లీన్ చేసుకోవాలి.ఈ రెమెడీని పాటించడం వల్ల పిగ్మెంటేషన్ సమస్య దూర‌మ‌వుతుంది.చర్మం పై పేరుకుపోయిన దుమ్ము ధూళి మరియు ఇతర మలినాలు తొలగిపోతాయి.

చర్మం మృదువుగా మరియు కాంతివంతంగా మారుతుంది.

Telugu Beautiful Skin, Tips, Latest, Multanimitti, Skin Care, Skin Care Tips-Tel

అలాగే ముల్తానీ మట్టిని మరొక విధంగా కూడా ఉపయోగించవచ్చు.అందుకోసం ఒక బౌల్‌లో రెండు టేబుల్ స్పూన్లు ముల్తానీ మట్టి, రెండు టేబుల్ స్పూన్లు క్యారెట్ తురుము, సరిపడా రోజ్‌ వాటర్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని పదినిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.

ఆపై తడి వేళ్ళతో చర్మాన్ని సున్నితంగా స్క్రబ్బింగ్ చేసుకుంటూ వాటర్ తో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.ఈ రెమెడీని పాటిస్తే చనిపోయిన చర్మ కణాలు తొలగిపోతాయి.చర్మం లోతుగా శుభ్రం అవుతుంది.అంతేకాకుండా ఈ రెమెడీ అదనపు నూనెను గ్రహిస్తుంది.

మొటిమలను నివారిస్తుంది.రక్త ప్రసరణను ప్రోత్సహిస్తుంది.

స్కిన్ కలర్ ను ఇంప్రూవ్ చేసి మిమ్మల్ని మరింత అందంగా మారుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube