కాఫీ.( Coffee ).ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా సేవించే పానీయాల్లో ఒకటి.కాఫీ ఒక డ్రింక్ కాదు ఎమోషన్ అంటుంటారు చాలామంది.
ఒక్కసారి కాఫీకి అలవాటు పడితే దాన్ని వదిలించుకోవడం అంత సులభం కాదు.దాని గొప్ప సువాసన మరియు ఉత్తేజపరిచే లక్షణాల కారణంగా కోట్లాది మందికి కాఫీ హాట్ ఫేవరెట్‌గా మారింది.
మనలో కూడా ఎంతో మంది కాఫీ ప్రియులు ఉన్నారు.కొందరైతే కాఫీ తోనే తమ రోజు ను ప్రారంభిస్తారు.
ఇంకొందరు తమ రోజును ముగిస్తారు.ఇకపోతే కాఫీ లో ఎన్నో రకాలు ఉన్నాయి.
అందులో కోల్డ్ కాఫీ మోస్ట్ ఫేమస్ అని చెప్పుకోవచ్చు.కోల్డ్ కాఫీ రుచి అల్టిమేట్ గా ఉంటుంది.
అందుకే కొందరు నిత్యం కోల్డ్ కాఫీ తాగుతుంటారు.అయితే రుచిగా ఉంటుందని రోజూ కోల్డ్ కాఫీ( Cold coffee ) తాగే వారు కచ్చితంగా కొన్ని విషయాలు తెలుసుకోవాలని నిపుణులు అంటున్నారు.
కోల్డ్ కాఫీలో ఫ్లేవర్డ్ క్రీమ్‌లు, సిరప్‌లు ( Flavored creams, syrups )మరియు చక్కెరను అధికంగా వినియోగిస్తారు.ఇవి బరువు పెరగడానికి దారితీస్తాయి.అదే సమయంలో టైప్ 2 డయాబెటిస్ వచ్చే రిస్క్ ను పెంచుతాయి.అలాగే కోల్డ్ కాఫీ దంత ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.ప్రతి రోజూ కోల్డ్ కాఫీ తాగితే దంతాలపై ఉండే ఎనామెల్ ఎఫెక్ట్ అవుతుంది.దంతక్షయం తలెత్తే అవకాశాలు అధికంగా ఉంటాయి.
కోల్డ్ కాఫీలో కెఫీన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది.ఇది కేంద్ర నాడీ వ్యవస్థను( central nervous system ) ప్రేరేపిస్తుంది, దీని వలన హృదయ స్పందన రేటు మరియు రక్తపోటు పెరుగుతాయి.ఇప్పటికే అధిక రక్తపోటు లేదా గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారికి ఇది మంచిది కాకపోవచ్చు.అలాగే కోల్డ్ కాఫీని ఓవర్ గా తీసుకోవడం వల్ల అందులోని కెఫీన్ శరీరాన్ని డీహైడ్రేట్ చేస్తుంది.
ఆందోళనను పెంచుతుంది.నిద్రకు భంగం కలిగిస్తుంది మరియు మొత్తం నిద్ర నాణ్యత తగ్గుతుంది.
అంతేకాకుండా కోల్డ్ కాఫీ గ్యాస్ట్రిక్ యాసిడ్ స్రావాన్ని ప్రేరేపిస్తుంది.ఫలితంగా యాసిడ్ రిఫ్లక్స్, గుండెల్లో మంట లేదా కడుపులో అసౌకర్యం తదితర సమస్యలు తలెత్తుతాయి.