విధ్వంసం సృష్టించిన హార్థిక్.. ఒకే ఓవర్లు 29 పరుగులు

భారత క్రికెటర్ స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా( Hardik Pandya ) ప్రస్తుతం భీకర ఫామ్ లో కొనసాగుతున్నాడు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.సౌత్ ఆఫ్రికా సిరీస్లో రెచ్చిపోయిన హార్థిక్ పాండ్య ప్రస్తుతం దేశవాళి క్రికెట్లో కూడా తనదైన మార్క్ షాట్లతో బౌలర్లపై విరుచుకపడుతున్నాడు.

 Harthik Who Created Havoc Scored 29 Runs In A Single Over, Hardik Pandya, Viral-TeluguStop.com

ప్రస్తుతం దేశవాలి క్రికెట్లో జరుగుతున్న సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో భాగంగా టీమిండియా స్టార్ ఆటగాడు హార్థిక్ పాండ్యా బౌలర్లపై కనికరం లేకుండా భారీ హిట్టింగ్ చేస్తున్నాడు.ఇక దేశవాళి టోర్నీలో( national tournament ) భాగంగా బరోడా టీం తమిళనాడుతో ఓ మ్యాచ్ జరిగింది.

ఈ మ్యాచ్లో టీమిండియా క్రికెటర్ రెచ్చిపోయాడు.హార్థిక్ పాండ్యా ఒకే ఓవర్ లో 29 పరుగులు సాధించి తన ప్రతాపాన్ని మరోసారి చూపించాడు.

Telugu Baroda, Hardik Pandya, Harthikhavoc, Syedmushtak, Tamil Nadu-Latest News

తమిళనాడుతో( Tamil Nadu ) జరిగిన మ్యాచ్‌లో కేవలం 30 బంతుల్లోనే 69 పరుగులు చేశాడు హార్దిక్ పాండ్యా.ఈ ఇన్నింగ్స్ లో అతడు 4 బౌండరీలతో పాటు.7 భారీ సిక్సులు కొట్టాడు.230 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేశాడు.భారీ షాట్లే లక్ష్యంగా ఆడుతూ.బౌలర్లకు విశ్వరూపం చూపించాడు.తమిళనాడులోని గుర్జన్‌ప్రీత్ సింగ్ ( Gurjanpreet Singh )వేసిన 17వ ఓవర్‌ లో ఏకంగా 4 సిక్సులతో పాటు ఓ బౌండరీ కొట్టాడు.చివరి బంతికి సింగిల్ రన్‌ చేసి మొత్తంగా ఒకే ఓవర్‌లో 29 పరుగులు వచ్చాయి.

కానీ ఆఖరి ఓవర్ తొలి బంతికి హార్థిక్ ఔట్ అయ్యాడు.

Telugu Baroda, Hardik Pandya, Harthikhavoc, Syedmushtak, Tamil Nadu-Latest News

తమిళనాడు నిర్దేశించిన 221 పరుగుల టార్గెట్‌కు చేరువగా వచ్చింది బరోడా.అయితే హార్దిక్ పాండ్యా అవుట్ కావడంతో చివరికి విజయం సాధిస్తుందో లేదో అని భావించగా.ఆఖర్లో అతిత్ చివరి బంతికి 4 పరుగులు అవసరమైన దశతో అతిత్ బౌండరీతో జట్టును గెలిపించాడు.

ఇక హార్దిక్ పాండ్యా ఒకే ఓవర్ లో 29 పరుగులు చేసిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube