అమెరికాలో ఖలిస్తాన్ వేర్పాటువాదులు రోజు రోజుకు రెచ్చిపోతుండటంతో అక్కడ పరిస్థితులు దిగజారుతున్నాయి.సిక్కుయేతర మతాలను ఖలిస్తానీయులు టార్గెట్ చేస్తుండటంతో ఎప్పుడేం జరుగుతుందో తెలియక వారు బిక్కుబిక్కుమంటున్నారు.
ముఖ్యంగా హిందూ కమ్యూనిటీ అయితే ఏ క్షణంలో ఏం వినాల్సి వస్తుందని భయపడుతున్నారు.అయితే ఈ పరిణామాలతో భారతీయ కాన్సులేట్ నిర్వహించాలి అనుకున్న కాన్సులర్ క్యాంప్‌లను కూడా రద్దు చేయాల్సి వచ్చింది.
కాన్సులర్ క్యాంప్‌లకు భద్రత కల్పించలేమని కెనడియన్ లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలు( Canadian Law Enforcement Agencies ) చేతులు ఎత్తేయడంతో భారతీయ మిషన్‌లు వెనక్కి తగ్గాల్సి వచ్చింది.దీంతో పెన్షనర్లు, సీనియర్ సిటిజన్లు తీవ్ర ఇబ్బందులు పడ్డాయి.
అయితే ఈ వీకెండ్‌లో కెనడాలోని పలు ప్రదేశాలలో ఏర్పాటు చేసిన కాన్సులర్ క్యాంప్‌లలో చివరి బ్యాచ్‌ను నిర్వహిస్తామని భారతీయ మిషన్లు తెలిపాయి.ఈ శనివారం టొరంటోలోని లక్ష్మీనారాయణ్ మందిర్, బ్రిటీష్ కొలంబియాలోని సర్రే, అంటారియో ప్రావిన్స్‌లోని లండన్‌లో ఈ ఈవెంట్లు జరుగుతాయి.
విదేశాల్లో స్థిరపడిన పింఛనుదారులకు లైఫ్ సర్టిఫికెట్లు అందించే లక్ష్యంతో చేపట్టిన కాన్సులర్ క్యాంప్‌లు గత వారాంతంలోనూ జరిగాయి.నవంబర్ 24న ఒంటారియోలోని కిచెనర్ ( Kitchener, Ontario )పట్టణంలోని సీనియర్‌లకు దాదాపు 600 లైఫ్ సర్టిఫికెట్‌లు జారీ చేశారు.శనివారం క్యూబెక్‌లోని మాంట్రియల్‌లో భారత హైకమీషన్ నిర్వహించిన కార్యక్రమంలో మరో 100 అందించబడ్డాయి.వాంకోవర్‌లోని భారత కాన్సులేట్ ఆదివారం బ్రిటిష్ కొలంబియాలోని ప్రిన్స్ జార్జ్‌లోనూ క్యాంప్ నిర్వహించింది.
అయితే భద్రతా కారణాల వల్ల అంటారియోలోని ఓక్‌విల్లేలోని వైష్ణోదేవి మందిర్‌లో జరగాల్సిన క్యాంప్‌ను రద్దు చేశారు.
వేర్పాటువాద సిక్కులు, సిక్కు వేర్పాటువాద సంస్థ ఎస్ఎఫ్‌జే సహా ఖలిస్తాన్ అనుకూల గ్రూపులు ఈ క్యాంప్‌లను లక్ష్యంగా చేసుకున్నాయి.దాని ఫలితంగా నవంబర్ 3న ఖలిస్తాన్ అనుకూల రాడికల్స్ బ్రాంప్టన్‌లోని హిందూ సభ మందిర్‌పై హింసాత్మక దాడి భారత్ – కెనడా మధ్య తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసిన సంగతి తెలిసిందే.