కంటి చూపు సన్నగిల్లడం.చాలా మందిలో ఈ సమస్య కనిపిస్తోంది.
ఎప్పుడో యాబై, అరవై ఏళ్ల తర్వాత వచ్చే ఈ సమస్య ఇటీవల కాలంలో చిన్న వయసులోనే ఎదుర్కొంటున్నారు.స్కూలుకు వెళ్లే పిల్లలు సైతం దృష్టి లోపాలతో ఇబ్బందులు పడుతున్నారు.
ఆహారపు అలవాట్లు, మారిన జీవన శైలి, స్మార్ట్ ఫోన్లు.ల్యాప్‌టాప్లు.
టీవీలు అతిగా చూడటం, పోషకాల లోపం ఇలా రకరకాల కారణాల వల్ల కంటి చూపు తగ్గుతుంది.దీనిని నిర్లక్ష్యం చేస్తే.
చివరకు కళ్లు పూర్తిగా మాసకబారతాయి.
అయితే కంటి చూపును మెరుగుపరచడంలో కొన్ని కొన్ని ఆహారాలు గ్రేట్‌గా సహాయపడతాయి.
అలాంటి వాటిలో కాకరకాయ టీ ఒకటి.అవును, దృష్టి లోపాలతో బాధ పడే వారికి కాకరకాయ టీ బెస్ట్ అప్షన్.
విటమిన్ ఎ, వటమిన్ సి, బీటా కెరోటిన్ వంటి పోషకాలు కంటి చూపును మెరుగుపరచడంతో ముఖ్య పాత్ర పోషిస్తాయి.అయితే ఈ పోషకాలన్నీ కాకరకాయ టీలో పుష్కలంగా ఉంటాయి.
ఇక ఈ కాకరకాయ టీని ఈజీగా ఇంట్లోనే తయారుచేసుకోవచ్చు.
ముందు ఒక గ్లాస్ వాటర్ వాటర్‌లో శుభ్రం చేసి కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలను వేసి బాగా మరిగించాలి.
ఇలా చేయడం వల్ల కాకరకాయలో ఉండే అన్ని పోషకాలు నీటిలోకి చేరతాయి.ఇప్పుడు ఈ వాటర్‌ను వడగట్టుకుని.అందులో ఒక స్నూన్ తేనె మిక్స్ చేసుకుని సేవించాలి.ఇలా కాకరకాయ టీ సేవించడం వల్ల కంటి చూపు మెరుగుపడడంతో పాటు మరిన్ని బెనిఫిట్స్ కూడా ఉన్నాయి.
కాకరకాయ టీని ప్రతి రోజు ఒక కప్పు చప్పున తీసుకుంటే.శరీరంలో అదనంగా ఉన్న కొవ్వు కరుగుతుంది.ఫలితంగా, వెయిట్ లాస్ అవ్వొచ్చు.కాకరకాయ టీ బ్లడ్ షుగర్ లెవల్స్‌ను అదుపు చేస్తుంది.
అందువల్ల, మధుమేహం ఉన్న వారు ఈ టీ తాగితే మంచిది.అలాగే కాలేయం, మూత్రాశయం ఆరోగ్యంగా ఉంచడంలోనూ కాకరకాయ టీ ఉపయోగపడుతుంది.
ఇక కాకరకాయ టీతో ఇమ్యూనిటీ సిస్టమ్ కూడా బలపడుతుంది.దాంతో రోగాలకు దూరంగా ఉండొచ్చు.