తెలంగాణలో కాంగ్రెస్ బీఆర్ఎస్( BRS ) మధ్య రాజకీయ యుద్ధం రోజురోజుకు ముదురుతోంది.ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ, ప్రజలకు దగ్గర అయ్యే ప్రయత్నం చేస్తున్నారు.
బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకునే విషయంలో పోటీ పడుతున్నారు.ఈ రేసులో బిజెపి ( BJP )వెనుకబడినట్టే కనిపిస్తోంది.
ఇది ఇలా ఉంటే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తి కాబోతోంది.దీంతో పాలనకు సంబంధించి విజయాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లేందుకు కాంగ్రెస్ పార్టీ భారీగా ప్లాన్ చేస్తోంది.
కాంగ్రెస్ అధిష్టానం పెద్దలను ఇప్పటికే ఈ విజయోత్సవాలకు హాజరు కావాల్సిందిగా సీఎం రేవంత్ రెడ్డి ( CM Revanth Reddy )ఆహ్వానించారు.ఇదిలా ఉండగానే కాంగ్రెస్ ను పూర్తిస్థాయిలో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ టార్గెట్ చేసుకున్నారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూకటి వేళ్ళతో పెకిలిస్తామని కేటీఆర్ పదేపదే చెబుతున్నారు.
లగచర్ల బాధితులకు అండగా రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా కార్యక్రమాలు చేపడతామని కేటీఆర్ ప్రకటించారు.
119 నియోజకవర్గాల్లో ధర్నా చేపట్టి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూకటి వేళ్ళతో పెకిలిస్తామంటూ ఆయన హెచ్చరికలు చేస్తున్నారు.రేవంత్ రెడ్డి ప్రభుత్వం తుమ్మితే ఓడిపోయే ముక్కు లాంటిదని , ఢిల్లీ ( Delhi )వాళ్లకు జలుబు చేస్తే ఇక్కడ రేవంత్ రెడ్డి పదవి పోతుందని ఎద్దేవా చేస్తున్నారు.కేటీఆర్ చేస్తున్న ఈ విమర్శలకు కాంగ్రెస్ సీనియర్ నేత , మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి గట్టిగానే కౌంటర్ ఇచ్చారు.
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో పెకిలిస్తామంటున్న కేటీఆర్ కు అంత శక్తి ఉందా అని జగ్గారెడ్డి ( Jaggareddy )ప్రశ్నించారు .కాంగ్రెస్ మర్రి చెట్టు లాంటిదని , దాన్ని ఎవరు ఏమి చేయలేరని జగ్గారెడ్డి కౌంటర్ ఇచ్చారు.ఈ విధంగా రెండు పార్టీల మధ్య మాటలు యుద్ధం కొనసాగుతూనే ఉంది.
మరికొద్ది రోజుల్లోనే బీఆర్ఎస్ దీక్ష దివస్ , కాంగ్రెస్ ప్రజా పాలన విజయోత్సవాలు ఉండడంతో , రెండు పార్టీల మధ్య రాజకీయ మాటల యుద్ధం తీవ్రస్థాయిలోనే జరిగే అవకాశం కనిపిస్తోంది ఎక్కడికక్కడ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టి , ప్రజల్లోకి వాటిని తీసుకువెళ్లి అన్ని రంగాల్లోనూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం విఫలమైందని, ఇచ్చిన హామీలను అమలు చేసే విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం చిత్తశుద్ధి ఏమిటో ఇప్పటికే ప్రజలకు అర్థమైందని బీఆర్ఎస్ కౌంటర్లు ఇస్తోంది.