టాలీవుడ్ హీరో మంచు మనోజ్( Manchu Manoj ) గురించి మనందరికి తెలిసిందే.మంచు మనోజ్ పేరు మొన్నటి వరకు సోషల్ మీడియాలో మారు మోగిన విషయం తెలిసిందే.
అందుకు గల కారణం మంచు కుటుంబంలో జరిగిన గొడవలు.మొన్నటి వరకు తండ్రితో కలిసి ఉన్న మనోజ్ గొడవలు జరగడంతో తన భార్యతో కలిసి మరోచోట ఉంటున్నాడు.
ఈ క్రమంలోనే తన కూతురి పుట్టినరోజు రాగా జైపూర్ లో( Jaipur ) సెలబ్రేట్ చేసుకున్నారు.కాగా మంచు మనోజ్ భూమా మౌనికని( Bhuma Mounika ) రెండో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.

ఇటీవలే ఈ దంపతులు ఒక పాప పుట్టగా ఈ చిన్నారికి దేవసేన( Devasena ) అని పేరు పెట్టారు.అయితే తాజాగా ఈమె పుట్టిన రోజుని రాజస్థాన్ లోని జైపూర్ లో సెలబ్రేట్ చేసుకున్నారు.మొన్న ఫొటోల్ని షేర్ చేసిన మనోజ్ ఇప్పుడు వీడియోని పోస్ట్ చేశాడు.ఆ వీడియో వైరల్ అవ్వడంతో అభిమానులు కొందరు పాజిటివ్ గా స్పందిస్తుండగా మరి కొందరు నెగిటివ్ గా స్పందిస్తున్నారు.
కాగా ఈ వీడియోలో భార్య, కొడుకు, కూతురితో కలిసి మనోజ్ చాలా ఆనందంగా కనిపించాడు.సాధారణంగా డెస్టినేషన్ వెడ్డింగ్స్ అంటుంటారు.

కానీ మనోజ్ తన కూతురి పుట్టిన రోజుని డెస్టినేషన్ బర్త్ డేగా సెలబ్రేట్ చేసుకున్నట్లు అనిపిస్తుంది.ఏదేమైనా వీడియో మాత్రం చూడ ముచ్చటగా ఉంది.ఇకపోతే మనోజ్ విషయానికి వస్తే.ప్రస్తుతం తన ఫ్యామిలీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే.అయితే మంచు మనోజ్ సినిమాలలో నటిస్తే చూడాలని చాలా మంది అభిమానులు కోరుకుంటున్నారు.మరి మనోజ్ మల్లీ సినిమాలలో ఎప్పుడు నటిస్తారో చూడాలి మరి.







