ప్రతి ఒక్కరు కూడా వాస్తు ప్రకారం అనుసరిస్తే ఇంట్లో ఎప్పుడు మంచి జరుగుతుంది.ఎక్కువ శుభ్రమైన ఇంటి వాతావరణం కూడా సానుకూలంగా ఉంటుంది.
వంటగదిలో లక్ష్మీదేవి( Lakshmi Devi )తో పాటు అన్నపూర్ణ మాట కూడా ఉంటుంది.అందుకే మనం మిగిలిన గదులు లాగే వంటగదిపై కూడా ప్రత్యేకమైన శ్రద్ధ వహించాల్సి ఉంటుంది.
ప్రతి చిన్న చిన్న విషయాలను మార్చడం వలన ఇంటి ఆనందాన్ని కూడా కాపాడుకోవచ్చు.ఇంట్లో ధనం, ధాన్యాల కొరత ఉండకూడదంటే ఈ సాధారణ చర్యలను అనుసరించాలి.

వంటగది సరైన దిశలో లేకుంటే మిమ్మల్ని ఎల్లప్పుడూ వ్యాధులు చుట్టూముడుతూ ఉంటాయి.ఇది మీ ఆరోగ్యం పై ప్రతికూల ప్రభావం చూపుతోంది.అందుకే ఈ వంటగది ఎప్పుడు సరైన దిశలో నిర్మించడం చాలా ముఖ్యం.అయితే వంటగది( Kitchen vastu )ని సౌత్ ఈస్ట్ జోన్లో నిర్మించుకోవడం చాలా మంచిది.
వంటగదిలో తూర్పు దిశలో కిటికీ ఉండాలి.అది చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది.
ఈ దిశలో వంట గదిలోకి సానుకూల శక్తి ప్రవేశిస్తుంది.

అయితే ఉదయాన్నే వంట గదిలో సూర్యకాంతి పడటం( Sunlight ) చాలా మంచిదని చెబుతారు.అయితే వంట దక్షిణ దిశలో చేయడం చాలా హానికరం.అందుకే అలాంటి సమయంలో వంట చేసేటప్పుడు మీ స్థానం ఎప్పటికీ కూడా తూర్పు వైపు ఉండేలా చూసుకోవాలి.
మిక్సర్, ఫ్రిడ్జ్, గ్రైండర్ మొదలైన అనేక ఎలక్ట్రానిక్ వంటగది సామాన్లు ఉన్నాయి.ప్రతి వాస్తు శాస్త్రం ప్రకారం ఈ వస్తువులు అన్నిటిని సరైన దిశలో ఉంచాలి.
ఈ వస్తువులను సౌత్ ఈస్ట్ జోన్లో మిక్సర్ ను ఉంచాలి.ఫ్రిజ్ ను నార్త్ వెస్ట్ జోన్లో ఉంచుకోవాలి.

ఇలా ఉంచడం వలన మీకు అదృష్టం కలుగుతుంది.వంటగదికి ఎప్పటికీ కూడా నలుపు, గోధుమ రంగులను వేయకూడదు.ఎప్పటికైనా నిమ్మకాయ పసుపు, పాస్టల్ గ్రీన్ లాంటి రంగులు వేసుకుంటే ఫలితం ఉంటుంది.ఇక పొరపాటున కూడా టాయిలెట్ పైన లేదా కింద వంటగది అస్సలు నిర్మించకూడదు.
ఎందుకంటే అన్నం పరబ్రహ్మ స్వరూపం అని అంటారు.అందుకే వంటగది ఆలయం కంటే తక్కువ కాదు.
వంట గదిలో పగిలిపోయిన పెట్టెలు, విరిగిపోయిన పాత్ర ఉంటే వాటిని వెంటనే తొలగించాలి.