తెలుగు నెలలు 4వ నెల అయిన ఆషాఢ మాసంలో వచ్చే శుద్ధ పౌర్ణమిని గురుపౌర్ణమి అని పిలుస్తారు.ఈ గురు పౌర్ణమిని వ్యాస పౌర్ణమి అని కూడా పిలుస్తారు.
ఈ గురుపౌర్ణమి ఈ ఎడాది 2021 జూలై 24వ తేదీ శనివారం వచ్చింది.ఈ గురు పౌర్ణమిని దేశవ్యాప్తంగా ఒక పండుగలాగా, ఒక వేడుకగా జరుపుకుంటారు.
మన హిందూ సాంప్రదాయాల ప్రకారం భగవంతుడు తరువాత కనిపించే తల్లిదండ్రులను, గురువారం దైవ సమానంగా భావిస్తాము కనుక తల్లిదండ్రుల తర్వాత అంతటి గొప్ప స్థానం దక్కిందని చెప్పవచ్చు.ఎంతో పవిత్రమైన ఈ గురుపౌర్ణమిని ఎందుకు జరుపుకుంటారు.
గురు పౌర్ణమి జరుపుకోవడానికి గల కారణం ఏమిటి అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
పురాణాల నుంచి నేటి వరకు గురువు అంటే అందరికీ వేదవ్యాస మహర్షి గుర్తుకొస్తారు.
ఈ క్రమంలోనే వేద వ్యాస మహర్షి జన్మించిన ఈ పౌర్ణమిని ఆయన జన్మదినానికి గుర్తుగా భావించి గురుపౌర్ణమి గా ప్రజలు పెద్ద ఎత్తున ఒక పండుగలాగా నిర్వహించుకుంటారు.ఈ విధంగా గురు పౌర్ణమి రోజు గురు భగవానుని స్మరించుకుని గురు విగ్రహానికి ప్రత్యేక పూజలు చేయటం వల్ల సకల సంపదలు కలుగుతాయని భక్తులు భావిస్తారు.
ఈ క్రమంలోనే గురు పౌర్ణమి రోజు గురు విగ్రహానికి ప్రత్యేక పూజలు చేస్తారు.

ఈ లోకంలో ప్రతి ఒక్కరికి మొదటి గురువు తల్లి.తల్లి తర్వాత మన లో ఉన్నటువంటి జ్ఞానాన్ని బయటకు తీసేది ఒక గురువు మాత్రమే కనుక గురువుకి అంతటి ప్రాధాన్యత కల్పిస్తారు.మన పురాణాల ప్రకారం వేదాలను నాలుగు భాగాలుగా విభజించి వాటిని సామాన్యుల చెంతకు చేరవేయడంలో వేదవ్యాస మహర్షి ఎంతో కృషి చేశారు.
మహాభారతాన్ని మనకు అందించిన జన్మదినం ఆషాడ మాస శుద్ధ పౌర్ణమి రోజు కనుక ఆ రోజును గురుపౌర్ణమిగా జరుపుకుంటారు.ఎంతో పవిత్రమైన ఈ గురు పౌర్ణమి రోజు గురువు అనుగ్రహం పొందాలంటే ప్రత్యేకమైన పూజలు హోమాలు చేయడం దానధర్మాలు చేయడం ద్వారా గురు అనుగ్రహం మనపై ఉంటుంది.
ఈ గురు పౌర్ణమి రోజు పెద్ద ఎత్తున దత్తాత్రేయునికి పూజలు చేస్తారు.అదేవిధంగా రెండు తెలుగు రాష్ట్రాలలో గురు పౌర్ణమి రోజు సాయిబాబా ప్రత్యేక పూజలను నిర్వహించి పెద్ద ఎత్తున భక్తులు బాబా ఆలయాలను సందర్శిస్తారు.
అదే విధంగా గురు పౌర్ణమి నుంచి మూడు రోజులపాటు ఆలయాలలో పెద్ద ఎత్తున ఉత్సవాలు జరుగుతాయి.