దేశంలో కరోనా వైరస్ మొదటి సారిగా ప్రవేశించినప్పుడు ప్రభుత్వాలు చేసిన హడావుడి గురించి అందరికి తెలిసిందే.ఇక మన ప్రధాని మోడీ అయితే మీటింగ్‌ల మీద మీటింగ్‌లు పెట్టి, అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలను అప్రమత్తం చేస్తూ, ప్రజల్లో చైతన్యం తీసుకు వస్తూ, మొత్తానికి కోవిడ్ మొదటి దశ నుండి ప్రజల ప్రాణాలకు పెద్దగా హాని జరగకుండా రక్షించారని అందరు అనుకున్నారు.
కానీ ఈ సమయంలో దేశ, రాష్ట్ర ఆర్ధిక పరిస్దితి క్షిణించింది.ఇదిలా ఉండగా కరోనా సెకండ్ వేవ్‌లో మాత్రం దాదాపుగా మొదటి సారి కనిపించిన హడావుడి మాత్రం కనిపించడం లేదు.
ఇందుకు ప్రజల నిర్లక్ష్యం కూడా ఉందన్నది పక్కన పెడితే, ఈ కరోనాను నేతలు తమ ఆయుధాలుగా మార్చుకుని అధికార పార్టీల పై దుమ్మెత్తి పోస్తున్నారు.
ఈ క్రమంలో ప్రధాని మోడీపై రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు.
కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం, ప్రజా వ్యతిరేక విధానాల వల్లే దేశంలో ఇలాంటి దుర్భర పరిస్థితులు నెలకొన్నాయని ఆరోపణలు చేశారు.ఈ కరోనా ప్రళయం వల్ల దేశం నలుమూలల నుంచి బాధకరమైన వార్తలు వినవలసి వస్తుందని వెల్లడించారు.
కాగా ఇప్పటికైనా కేంద్రం తన తీరును మార్చుకొని, పనికి రాని ఉత్సవాలు, ప్రసంగాలు కాకుండా సంక్షోభానికి పరిష్కరాం చూపించాల్సిన అవసరం ఉందని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.